Home /News /politics /

NARA LOKESH INTERESTING COMMENTS ON HIS CONTESTING IN ASSEMBLY ELECTIONS MS

చంద్రగిరి ఎందుకు.. పక్కనే మంగళగిరి ఉందని చెప్పారు : లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

నారా లోకేష్ (File)

నారా లోకేష్ (File)

Nara Lokesh comments on Mangalagiri contest : 1978లో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే టర్మ్‌లో అంజయ్య కేబినెట్‌లో మంత్రిపదవి కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో లోకేశ్‌కు ఇవి తొలి ఎన్నికలు కావడంతో.. ఆయన్ను కూడా చంద్రగిరి బరిలో నిలుపుతారన్న ఊహాగానాలు వినిపించాయి.

ఇంకా చదవండి ...
    ప్రస్తుతం ఎమ్మెల్సీ హోదాతో మంత్రిగా కొనసాగుతున్న నారా లోకేశ్.. రాబోయే ఎన్నికల్లో సత్తా చాటి శాసనసభలో అడగుపెట్టాలని భావిస్తున్నారు. తద్వారా ప్రత్యక్ష ఎన్నికల్లోనూ తాను రాణించగలనని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.ఇందుకోసం ఇప్పటికే మంగళగిరిలో ప్రచారాన్ని ముమ్మరం చేసిన లోకేశ్.. అక్కడి ప్రజలను ఆకట్టుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. మంగళవారం ఉదయం మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లిన లోకేశ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని సీఎంతో చెప్పినప్పుడు.. అప్పుడాయన ఒకే మాట చెప్పారని అన్నారు. చంద్రగిరి అవసరం లేదని.. పక్కనే ఉన్న మంగళగిరి నుంచి పోటీ చేయాలని సూచించినట్టు తెలిపారు. ప్రజలతో మమేకమై.. ప్రజాదరణ చూరగొన్న తర్వాతే అసెంబ్లీలో అడుగుపెట్టమని చెప్పినట్టు పేర్కొన్నారు. అందుకే మంగళగిరిలో పోటీకి దిగానని.. తనను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభ రెండు ఓట్లు ఉంటాయని.. ఆ రెండూ సైకిల్ గుర్తుకే వేయాలని ప్రజలను కోరారు.

    కాగా, 1978లో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం తొలిసారి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే టర్మ్‌లో అంజయ్య కేబినెట్‌లో మంత్రిపదవి కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో లోకేశ్‌కు ఇవి తొలి ఎన్నికలు కావడంతో.. ఆయన్ను కూడా చంద్రగిరి బరిలో నిలుపుతారన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ చివరకు చంద్రబాబు సూచన మేరకు లోకేశ్ మంగళగిరి నియోజకవర్గానికే ఫిక్స్ అయ్యారు.
    First published:

    Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Chandrababu naidu, Lok Sabha Election 2019, Nara Lokesh

    తదుపరి వార్తలు