వైఎస్ జగన్ చెన్నైలో కొత్త ప్యాలెస్ కడుతున్నారు.. నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఎగతాళి చేస్తే జగన్‌ను గోచీతో నిలపెట్టే రోజు దగ్గరలోనే ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: October 30, 2020, 2:26 PM IST
వైఎస్ జగన్ చెన్నైలో కొత్త ప్యాలెస్ కడుతున్నారు.. నారా లోకేశ్
నారా లోకేశ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఎగతాళి చేస్తే జగన్‌ను గోచీతో నిలపెట్టే రోజు దగ్గరలోనే ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.. సీఎం వైఎస్ జగన్ చెన్నైలో కొత్త ప్యాలెస్ కడుతున్నారని ఆరోపించారు. శుక్రవారం అమరావతిలో లోకేశ్ మీడియాతో మాట్లాడారు. వరద బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు కనీసం నిత్యావసరాలు అందజేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని రైతు లేని రాజ్యంగా జగన్ తయారు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

కేసుల మాఫీ కోసమే పోలవరం అంచనాలు కుదించారని, చేతకాని 22మంది ఎంపీల వల్ల పోలవరానికి రూ.30వేల కోట్లు నష్టమని వాపోయారు. రైతులకు కూడా కులం అంటగట్టిన చరిత్ర జగన్‌దేనని అన్నారు. రూ. 4వేల కోట్ల అప్పు కోసం వ్యవసాయానికి మీటర్లు బిగించడం సరికాదన్నారు. చెన్నైలో జగన్ కొత్త ప్యాలెస్ కడుతున్నారని, జగన్ ప్యాలెస్‌లు తనఖా పెట్టి అప్పు తెచ్చుకోవాలని సూచించారు. వ్యవసాయానికి మీటర్లు బిగిస్తే వాటిని పీకేస్తామని హెచ్చరించారు. సైకిళ్లకు మీటర్లు కట్టి ఊరేగిస్తామని అన్నారు.

వైఎస్ జగన్ 18 నెలల పాలన కాలంలో 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. ఇదేనా రైతు రాజ్యం అని ప్రశ్నించారు. రైతులు వ్యవసాయం వదిలేసే స్థితికి తీసుకువచ్చారని విమర్శించారు. అకాల వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం కనీస మద్దుతు ధర ఇవ్వాలని, ముంపుకు గురైనా ప్రతి కుటుంబానికి రూ. 5వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
Published by: Sumanth Kanukula
First published: October 30, 2020, 2:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading