Home /News /politics /

విశాఖ విషాదంలో ఉంటే వైసీపీ విష ప్రచారం.. లోకేష్ ఫైర్...

విశాఖ విషాదంలో ఉంటే వైసీపీ విష ప్రచారం.. లోకేష్ ఫైర్...

నారా లోకేష్

నారా లోకేష్

గ్యాస్ లీక్ అయ్యి విశాఖ వాసులు విషాదంలో ఉంటే, వైసీపీ పేటీఎం బ్యాచ్ విష ప్రచారం మొదలు పెట్టిందని టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు.

    గ్యాస్ లీక్ అయ్యి విశాఖ వాసులు విషాదంలో ఉంటే, వైసీపీ పేటీఎం బ్యాచ్ విష ప్రచారం మొదలు పెట్టిందని టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. రాజధాని కావాలని కోరిన వారికి బాగా జరిగిందంటూ కొందరు ట్విట్టర్‌లో పోస్టులు పెట్టినట్టు ఫొటోలు వైరల్ అయ్యాయి. అవి టీడీపీ నేతలే పెట్టినట్టుగా హ్యాష్ ట్యాగ్స్ కూడా క్రియేట్ అయ్యాయి. సేవ్ అమరావతి, మై క్యాపిటల్ అమరావతి పేరుతో హ్యాష్ ట్యాగ్స్ ఉన్న ఫేక్ ఫొటోలను లోకేష్ ట్వీట్ చేశారు. ‘గ్యాస్‌ లీకై విశాఖ వాసులు విషాదంలో వుంటే వైకాపా విష‌ప్ర‌చారానికి తెర‌లేపింది. పేటీఎం పుత్రులు క‌నీస మాన‌వ‌తాదృక్ప‌థం లేకుండా ప్రాంతీయ విద్వేషాలు రేపేలా ఫేక్ ట్వీట్లు వేసి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు. డ‌బ్బులిస్తామంటే క‌న్న‌త‌ల్లిని కూడా చంపేసే టైపు పేటీఎం బ్యాచులే ఇటువంటి విద్వేషాలు పెంచే విష‌ప్ర‌చారానికి దిగుతాయి. విశాఖ‌వాసులు ఎవ‌రూ ఆందోళ‌న చెందొద్దు. కేంద్రం, అధికారులు, ఎన్డీఆర్ఎఫ్‌ అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. నిపుణుల సూచ‌న‌లు పాటించండి. పుకార్లు న‌మ్మొద్దు. 5 రూపాయ‌ల కోసం రాష్ట్రాన్ని, ప్ర‌జ‌ల్ని తాక‌ట్టు పెట్టేందుకైనా వెనుకాడ‌ని పేటీఎం బ్యాచుల ఫేక్ ప్ర‌చారానికి విజ్ఞ‌త‌తో బ‌దులిద్దాం.’ అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Nara Lokesh, Tdp, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు