చలో ఆత్మకూరు పిలుపుతో బుధవారం ఉండవల్లిలో చంద్రబాబు ఇంటి వద్ద హైడ్రామా నడిచింది.ఆత్మకూరుకు వెళ్లకుండా చంద్రబాబును ఇంటి నుంచి బయటకురాకుండా అడ్డుకున్నారు పోలీసులు. చంద్రబాబు ఇంటి గేటుకు పెద్ద పెద్ద తాళ్లను కూడా కట్టారు. గేటు బయట బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే గేటులోపల చంద్రబాబును ప్రముఖ ఉగ్రవాది బిన్ లాడెన్లా మార్ఫింగ్ చేస్తూ కొందరు ఓ పోస్టును క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఆ పోస్టుపై మండిపడ్డారు చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్.
‘అసలీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నట్టా లేనట్టా? మీ గుడ్డి సర్కారుకు ఇలాంటి మార్ఫింగ్ పోస్టులు కనపడట్లేదా? ఒక మాజీ ముఖ్యమంత్రి పై ఇలాంటి పోస్టు పెట్టిన వాళ్ళపై చర్యలు తీసుకోడానికి చేతులు రావట్లేదా? చట్టాలు లేవా? మీ చట్టాలన్నీ తెదేపా అభిమానులమీద కేసులు పెట్టడానికేనా?’ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. జగన్ ప్రభుత్వ తీరుపై నారా లోకేష్ మండిపడ్డారు. మాజీ సీఎంపై ఇలాంటి మార్ఫింగ్ పోస్టులపెడితే చర్యలు తీసుకోవడానికి సీఎం జగన్కు చేతులు రావడం లేదని విమర్శలు గుప్పించారు.
.@ysjaganగారూ! అసలీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నట్టా లేనట్టా? మీ గుడ్డి సర్కారుకు ఇలాంటి మార్ఫింగ్ పోస్టులు కనపడట్లేదా? ఒక మాజీ ముఖ్యమంత్రి పై ఇలాంటి పోస్టు పెట్టిన వాళ్ళపై చర్యలు తీసుకోడానికి చేతులు రావట్లేదా? చట్టాలు లేవా? మీ చట్టాలన్నీ తెదేపా అభిమానులమీద కేసులు పెట్టడానికేనా? pic.twitter.com/RgkjWNOTYP
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.