హోమ్ /వార్తలు /National రాజకీయం /

మంగళగిరిలో లోకేష్ నామినేషన్.. వెంటవచ్చిన బ్రాహ్మణి, భువనేశ్వరి, దేవాన్ష్

మంగళగిరిలో లోకేష్ నామినేషన్.. వెంటవచ్చిన బ్రాహ్మణి, భువనేశ్వరి, దేవాన్ష్

మంగళగిరిలో లోకేష్ నామినేషన్

మంగళగిరిలో లోకేష్ నామినేషన్

నామినేషన్‌కు బయల్దేరి వెళ్లే ముందు లోకేష్ తల్లిదండ్రుల వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. తండ్రి చంద్రబాబు నాయుడు.. తల్లి భువనేశ్వరికి పాదాభివందనాలు చేశారు.

  గుంటూరు జిల్లా మంగళగిరిలో నామినేషన్ దాఖలు చేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్. మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న లోకేశ్ ఈరోజు తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. మంగళగిరిలోని తహశీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందించారు. లోకేశ్ వెంట టీడీపీ నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు, ఆయన కుటుంబసభ్యులు ఉన్నారు. లోకేశ్‌తో ఆయన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి, కొడుకు దేవాన్ష్ ఉన్నారు. అంతకుముందు ఇంటి వద్ద తల్లిదండ్రులకు పాదాభివందనలు చేసి నామినేషన్ వేసేందుకు బయల్దేరారు నారా లోకేష్. తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నామినేషన్‌కు బయల్దేరి వెళ్లే ముందు ఆయన తల్లిదండ్రుల వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. తండ్రి చంద్రబాబు నాయుడు.. తల్లి భువనేశ్వరి కాళ్లకు మొక్కి ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం భార్య బ్రహ్మణీ కొబ్బరికాయతో దిష్టి తీసి నారా లోకేష్‌కు ఎదురు వచ్చారు. అనంతరం లోకేష్ నామినేషన్ వేసేందుకు బయల్దేరి వెళ్లారు.

  తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేస్తున్న లోకేష్

  తాజా ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారని టీడీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చింది. దీంతో లోకేష్ తొలిసారి అసెంబ్లీ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. అనేక సమీకరణాల తర్వాత మంగళగిరి నుంచి లోకేష్‌ను బరిలోకి దించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. గతంలో చంద్రబాబు పోటీ చేసిన కుప్పంతో పాటు హిందూపూర్ వంటి స్థానాలు టీడీపికి కంచుకోటలు. ఈ రెండు స్థానాల్లో చంద్రబాబు, బాలకృష్ణ పోటీ తప్పనిసరి అని టీడీపీ భావిస్తోంది. అందుకే మరో స్థానం కోసం వెతికి చివరికి మంగళగిరి కేటాయించారు. ఇక్కడ సామాజికవర్గాల పరంగా చూస్తే బీసీల జనాభా అధికంగా ఉంది. తాజాగా ఇక్కడ కొన్ని ఐటీ కంపెనీలు ప్రారంభమయ్యాయి. ఈ రెండు సమీకరణాల్నీ దృష్టిలో పెట్టుకుని లోకేష్‌ను మంగళగిరి నుంచీ బరిలోకి దింపారు.

  Published by:Sulthana Begum Shaik
  First published:

  Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, AP News, Chandrababu Naidu, Nara Lokesh

  ఉత్తమ కథలు