Home /News /politics /

NARA LOKESH EXPENSES FOR SNACKS IS RS 25 LAKHS TWEETS YSRCP MP VIJAYASAI REDDY BA

నారా లోకేష్ రూ.25 లక్షల స్నాక్స్ తిన్నారా?

నారా లోకేష్ (File Photo)

నారా లోకేష్ (File Photo)

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నారా లోకేష్ మంత్రిగా పనిచేశారు. ఆయన అధికారిక పర్యటనల కోసం విశాఖ వచ్చినప్పుడు విమానాశ్రయంలో లోకేష్‌కు ఫలహారాలు అందించారు.

    ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ స్నాక్స్ కోసం రూ.25 లక్షలు ఖర్చు చేశారా? దీనిపై ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయాన్ని వైసీపీ ఎంపీ అధికారికంగా ట్వీట్ చేయడం ఆరోపణలకు మరింత ఆజ్యం పోసింది. ‘విశాఖ ఎయిర్ పోర్టులో చంద్రబాబు గారి పుత్రరత్నం లోకేశ్ స్నాక్స్ ఖర్చు రూ.25 లక్షలట. నిజంగా నారా లోకేష్ తిండే ఆ స్థాయిలో ఉంటుందా? ఫ్యూజన్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరి దొంగ బిల్లులు సృష్టించాడా? వెయ్యి మంది జనాభా ఉన్న గ్రామం రూ.25 లక్షల భత్యంతో నెల రోజులు గడుపుతుంది.’ అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.



    చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నారా లోకేష్ మంత్రిగా పనిచేశారు. ఈ సందర్భంగా అధికారిక పర్యటనల కోసం విశాఖ వచ్చినప్పుడు విమానాశ్రయంలో ఆయనకు ఫలహారాలు అందించారు. అలా మొత్తం రూ.25లక్షల విలువైన స్నాక్స్ తిన్నారంటూ సదరు ఫ్యూజన్ రెస్టారెంట్ ప్రభుత్వానికి బిల్లులు పెట్టింది. అయితే, అందులో కొత్తం మొత్తం గతంలోనే చెల్లించినట్టు సమాచారం. మరో రూ.13లక్షల బిల్లులు పెడింగ్‌లో ఉన్నాయని, వాటిని విడుదల చేయాలంటూ ఫ్యూజన్ రెస్టారెంట్ యాజమాన్యం విజ్ఞప్తి చేయగా.. అధికారులు దాన్ని పెండింగ్‌లో పెట్టినట్టు తెలిసింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Chandrababu naidu, Nara Lokesh, Tdp, Vijayasai reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు