Nara Lokesh: నారా లోకేష్ కు తప్పిన పెను ప్రమాదం.. కాల్వలోకి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో..

Nara Lokesh: నారా లోకేష్ కు తప్పిన పెను ప్రమాదం.. కాల్వలోకి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో..

నారా లోకేశ్ (ఫైల్ ఫోటో)

Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద ట్రాక్టర్ నడిపారు. అయితే ఆ ట్రాక్టర్ అదుపుతప్పి ఒక్కసారిగా ఉప్పటేరు కాల్వలోకి దూసుకెళ్లింది.

  • Share this:
    టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో లోకేష్ ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద ట్రాక్టర్ నడిపారు. అయితే ఆ ట్రాక్టర్ అదుపుతప్పి ఒక్కసారిగా ఉప్పటేరు కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. అయితే లోకేష్ పక్కనే ఉన్న ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే మంతెన రామరాజు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయన ట్రాక్టర్‌ను అదుపు చేశారు. దీంతో ప్రమాదం తప్పింది. అనంతరం లోకేష్‌ను ట్రాక్టర్‌ నుంచి దింపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో లోకేష్ వెంట ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. లోకేష్ కు ఎలాంటి గాయాలు కాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. కొద్ది సేపటి తర్వాత లోకేష్ తన పర్యటనను తిరిగి ప్రారంభించారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ఆయన పరామర్శిస్తున్నారు.

    ఇటీవల గుంటూరు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ యువనేత, మాజీమంత్రి నారా లోకేష్ పర్యటించారు. రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. రైతు కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని నారా లోకేష్ అన్నారు. ఆశల్ని, ఆస్థిని పెట్టుబడిగా పెట్టి పండించిన పంట నీళ్ల పాలు అయితే ఆ కష్టం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూశానని వ్యాఖ్యానించారు. రైతు రాజ్యం తెస్తా అన్న జగన్ రెడ్డి గారు రైతు లేని రాజ్యం తెస్తున్నారని లోకేష్ ఆరోపించారు. రైతులు టీషర్టు వేసుకుంటారా?టర్కీ టవల్ వేసుకుంటారా అని రైతుల్ని జగన్ రెడ్డి గారు అవమానించారని విమర్శించారు. సీఎం జగనల్ పాలనలో రైతుకి గోచి మాత్రమే మిగిలే పరిస్థితి వచ్చిందని అన్నారు. రైతులు టీషర్టు వేసుకుంటారా?టర్కీ టవల్ వేసుకుంటారా అని రైతుల్ని జగన్ రెడ్డి గారు అవమానించారని విమర్శించారు.

    సీఎం జగనల్ పాలనలో రైతుకి గోచి మాత్రమే మిగిలే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఈ నెలలో వచ్చిన వరదల కారణంగా 2.50 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిందని అన్నారు. సుమారుగా రూ. 400 కోట్లు నష్టపోయారని నారా లోకేష్ అన్నారు. వరి,పత్తి,మినుము,వేరుశనగ,మిరప,చెరుకు పంటలు దెబ్బతిన్నాయని, ఎప్పుడూ లేని విధంగా జగన్ రెడ్డి గారి పాలనలో రైతులు అనేక కష్టాలు ఎదుర్కుంటున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రైతులకు విత్తనాలు,ఎరువులు ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది అని లోకేశ్ మండిపడ్డారు. 17 నెలల్లో 750 మందికి పైగా రైతులు అత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. రైతుని దగా చేసింది వైసీపీ ప్రభుత్వం అని లోకేశ్ విమర్శించారు. రైతుభరోసా రూ.13,500 ఇస్తామని, అందులో రూ.6 వేలు ఎగ్గొట్టి, కేంద్రం ఇచ్చేది కలిపేశారని మండిపడ్డారు.
    Published by:Nikhil Kumar S
    First published: