NARA LOKESH DEMANDS SHIFTING OF LG POLYMERS COMPANY IN VISAKHAPATNAM AK
వెంటనే అలా చేయండి... నారా లోకేశ్ డిమాండ్
ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ టీడీపీ నినాదమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేశ్ అన్నారు. న్యాయస్థానాల్లో ప్రజల ఆకాంక్షలకు న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజా రాజధాని అమరావతిని పరిరక్షించుకుని తీరుతామని తెలిపారు.
విష వాయువులతో ప్రాణాలు తీస్తున్న కంపెనీ తమకొద్దని ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేపడితే వారిని అరెస్ట్ చేస్తున్నారని నారా లోకేశ్ విమర్శించారు.
విశాఖలో ప్రజల చావుకు కారణం అయిన కంపెనీ ప్రతినిధులకు రెడ్‌కార్పెట్ వేసి మాట్లాడుతున్నారన్న నారా లోకేశ్...ప్రశ్నించిన ప్రజలను మాత్రం అణిచివేస్తున్నారని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అదే కోటి మీకిస్తాం చావడానికి సిద్ధమా? అని ముఖ్యమంత్రి జగన్‌ను, వైసీపీ మంత్రులను విశాఖ వాసులు, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులు ప్రశ్నిస్తున్నారని ట్విట్టర్ వేదికగా కామెంట్ చేశారు. విష వాయువులతో ప్రాణాలు తీస్తున్న కంపెనీ తమకొద్దని ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేపడితే వారిని అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు. ప్రజల డిమాండ్‌కు అంగీకరించి కంపెనీని అక్కడి నుంచి తరలించాలని అన్నారు. మంత్రులు అధికారమదంతో మాట్లాడుతున్నారని లోకేశ్ మండిపడ్డారు. ప్రజలు వేసిన ఓట్లతోనే పెత్తనం చేస్తున్నారనే విషయాన్ని మర్చిపోయి.. ప్రజల్ని అవమానిస్తూ మాట్లాడటం దారుణమని నారా లోకేశ్ అన్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.