వైఎస్ వివేకా హత్య కేసుపై నారా లోకేష్ సంచలన ట్వీట్

‘కోడికత్తి వెనుక మహాకుట్ర ఉంది, సీబీఐ విచారణ చేపట్టాలని టీవీల్లో అరిచిన గ్యాంగ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంది? ’ అని నారా లోకేష్ ప్రశ్నించారు.

news18-telugu
Updated: September 8, 2019, 3:48 PM IST
వైఎస్ వివేకా హత్య కేసుపై నారా లోకేష్ సంచలన ట్వీట్
నారా లోకేష్ (File)
news18-telugu
Updated: September 8, 2019, 3:48 PM IST
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంద రోజుల పాలన మీద టీడీపీ నేత నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిదానికీ సీబీఐ రావాలని డిమాండ్ చేసిన వైసీపీ ఇప్పుడు ఎందుకు వాటిపై సీబీఐ విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. ‘రావాలి సీబీఐ.. కావాలి సీబీఐ.. అన్నారు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారో! బాబాయ్ హత్య కేసుని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసిన పెద్ద మనుషులు ఇప్పుడు వారే అధికారంలో ఉన్నా సీబీఐ వద్దు అని ఎందుకు అంటున్నారు? హత్య కేసులో అనుమానితుల ఆత్మహత్యల వెనుక రహస్యం ఏంటి?.’ అని ట్వీట్ చేశారు.


దీంతోపాటు ‘కోడికత్తి వెనుక మహాకుట్ర ఉంది, సీబీఐ విచారణ చేపట్టాలని టీవీల్లో అరిచిన గ్యాంగ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంది? నిందితుడు జైల్లోనే ప్రాణహాని ఉంది అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? సీబీఐకి కేసు అప్పగిస్తే నిజాలు బయటపడి జీవితాంతం శుక్రవారం కోర్టుకి వెళ్లాల్సివస్తుందని భయమా?’ అని నారా లోకేష్ మరో ట్వీట్ చేశారు.First published: September 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...