‘అందరూ జగన్‌కి ఓటేశాం...నరకం చూస్తున్నాం’

ఇంతకాలం తనను అధికారానికి దూరం ఉంచినందుకు ప్రజలపై కక్షసాధించేలా సీఎం జగన్ పాలన ఉందంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విరుచుకపడ్డారు. అన్నా క్యాంటీన్లను తిరిగి తెరిచి, పేదల కడుపునింపాలని డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: August 16, 2019, 10:18 AM IST
‘అందరూ జగన్‌కి ఓటేశాం...నరకం చూస్తున్నాం’
నారా లోకేశ్ (File)
  • Share this:
‘మొన్నటి ఎన్నికల్లో అందరూ జగన్‌కు ఓటేశాం...ఇప్పుడు నరకం చూస్తున్నాం’ అంటూ ఓ వ్యక్తి వైసీపీ సర్కారుపై విరుచుకపడుతున్న వీడియోను టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. అన్నా క్యాంటీన్లను తాత్కాలికంగా మూసివేస్తూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల వద్ద టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన దీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా సీఎం వైఎస్ జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు.

ఎన్నికల్లో గెలిపించినందుకు ప్రజల రుణం తీర్చుకునేలా జగన్ పాలన ఉండాలని...అయితే ఇన్నాళ్లు అధికారానికి దూరం చేసినందుకు కక్ష సాధించేలా జగన్ పాలన ఉందని నారా లోకేశ్ విరుచుకపడ్డారు. అన్నా క్యాంటీన్ల మూసివేత ఒక్కటే వేయి పాపాల పెట్టుగా ఎద్దేవా చేశారు. అన్నా క్యాంటీన్లను తిరిగి తెరిచి పేదల ఆకలి తీర్చాలని కోరారు.


కాగా మరో ట్వీట్‌లో అన్నా క్యాంటీన్‌లో భోజనం చేస్తున్న చిన్నారుల ఫోటోను ట్వీట్ చేసిన నారా లోకేశ్...ఇప్పుడు వారికి ఏం సమాధానం చెబుతారంటూ నారా లోకేశ్ ప్రశ్నించారు.
First published: August 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు