అందుకే కర్నూలు వెళ్లారా ?... జగన్‌పై లోకేశ్ విమర్శలు

చంద్రబాబు మొదలు పెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయకూడదు అనే జగన్ ధోరణి చూస్తే... ఆయనఎంత కడుపు మంటో అర్ధమవుతోందని లోకేశ్ మండిపడ్డారు.

news18-telugu
Updated: February 19, 2020, 12:16 PM IST
అందుకే కర్నూలు వెళ్లారా ?... జగన్‌పై లోకేశ్ విమర్శలు
నారా లోకేష్, వైఎస్ జగన్
  • Share this:
సీఎం జగన్‌పై టీడీపీ నేత లోకేష్‌ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. మాయమాటలు చెప్పటానికే కర్నూలు వెళ్లారా జగన్ గారు ? అంటూ సెటైర్ వేశారు. కర్నూలు పర్యటనలో ఆ జిల్లా గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. ఓర్వకల్లు పారిశ్రామికవాడ, నంద్యాల, నందికొట్కూరులో విత్తనోత్పత్తి కేంద్రాలు, కర్నూలు-అమరావతి రోడ్డు విస్తరణ, సాగునీటి సమస్య వంటి అంశాలపై ఒక్క మాటా మాట్లాడలేదు ఎందుకని అని నిలదీశారు. టీడీపీ మొదలు పెట్టిన వేదవతి, గుండ్రేవుల, ఆర్‌డీఎస్ కుడికాలువ, ఎల్‌ఎల్‌సీ బైపాస్‌ కెనాల్‌ వంటి ప్రాజెక్టుల గురించి ప్రస్తావన ఏది అని లోకేష్ ప్రశ్నించారు.

గత ప్రభుత్వం మొదలు పెట్టింది కాబట్టి తమకు అనవసరం అనుకున్నారా? అని ధ్వజమెత్తారు. చంద్రబాబు మొదలు పెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయకూడదు అనే మీ ధోరణి చూస్తే...మీకు ఎంత కడుపు మంటో అర్ధమవుతోందని మండిపడ్డారు. మీరు చెప్పినట్టు, నిజంగానే మీ కడుపు మంటకు మందు లేదంటూ లోకేష్‌ ట్వీట్ చేశారు.


First published: February 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు