Home /News /politics /

NARA LOKESH COUNTER TO AP CM YS JAGAN MOHAN REDDY ON CABINET SUB COMMITTEE AK

మా బాబుపై మీ బాబు... సీఎం జగన్‌కు నారా లోకేశ్ కౌంటర్

సీఎం జగన్ ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలోనూ ఇలానే తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకుని మొట్టికాయలు తిన్నారని లోకేశ్ అన్నారు. ఇప్పుడు మూడు ముక్కలాటలో మరోసారి వైసీపీ ప్రభుత్వానికి భంగపాటు తప్పదని హెచ్చరించారు.

సీఎం జగన్ ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలోనూ ఇలానే తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకుని మొట్టికాయలు తిన్నారని లోకేశ్ అన్నారు. ఇప్పుడు మూడు ముక్కలాటలో మరోసారి వైసీపీ ప్రభుత్వానికి భంగపాటు తప్పదని హెచ్చరించారు.

Nara Lokesh counter to Ys jagan mohan reddy | గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి వెలికితీసేందుకు ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీపై టీడీపీ నేత, ఏపీ మాజీమంత్రి నారా లోకేశ్ తనదైన శైలిలో స్పందించారు.

    గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికితీసేందుకు మంత్రివర్గ ఉప సంఘం వేసిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ నేత, ఏపీ మాజీమంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. పోలవరంపై టీడీపీ హయాంలో పంపిన అంచనాలన్నింటికీ కేంద్రం ఓకే చెప్పిందని లోకేశ్ అన్నారు. అందరూ మీలా అవినీతిపరులే అని ముద్ర వేయ్యాలి అనుకుంటున్న మీ కల... కలగానే మిగిలిపోతుందని సీఎం జగన్‌ను విమర్శించారు. మీ బాబు,మా బాబుపై 26 కమిటీలు వేశారని పరోక్షంగా గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేసిన కమిటీలను గుర్తు చేశారు. అవినీతి ముద్రవేయాలని అడ్డదారులు తొక్కారని... అయినా ఆయన తరం కాలేదని అన్నారు.




    వంశధారపై మీరు వేసి కమిటీ రూపాయి అవినీతి జరగలేదని నివేదిక ఇచ్చిందని వ్యాఖ్యానించారు. అక్రమాస్తుల కేసుల్లో మీపై లెక్కకు మించి చార్జిషీట్లున్నాయని లోకేశ్ విమర్శించారు. నిందితుడిగా జైలులో ఉన్నారని అన్నారు. అలాంటి మీరు నీతి, నిజాయితీ అని మాట్లాడుతుండటం ఏమీ బాగోలేదు సార్ అంటూ జగన్‌పై సెటైర్లు వేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Ap cm ys jagan mohan reddy, Nara Lokesh, Tdp, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు