NARA LOKESH COUNTER TO AP CM YS JAGAN MOHAN REDDY AK
జగన్కు లోకేశ్ కౌంటర్... బీద అరుపులు వద్దని సూచన
నారా లోకేష్ (ఫైల్)
తమ హయాంలో పెట్టుబడులు తెచ్చేందుకు ఎంతగానో కృషి చేశామని లోకేశ్ అన్నారు. ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్లో మూడేళ్లుగా ఏపీ నెంబర్వన్ స్థానంలో ఉందని వ్యాఖ్యానించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్పై మరోసారి విమర్శలు గుప్పించారు టీడీపీ నేత, ఏపీ మాజీమంత్రి లోకేశ్. విదేశీ రాయబారులు, కన్సల్టెంట్స్ సదస్సుల్లో ఏపీ రాష్ట్ర పరిస్థితిని సీఎం జగన్ తక్కువ చేసి మాట్లాడటం సరికాదని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఎవరైనా మన బాలాల గురించి చెప్పి పెట్టుబడులను ఆకర్షిస్తారని, కానీ జగన్ మాత్రం టీడీపీపై కోపంతో రాష్ట్రం సాధించిన ప్రగతిని చెప్పుకోలేక పోతున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీ గురించి బీద అరుపులు అరిస్తే పెట్టుబడులు రావని ఎద్దేవా చేశారు. పెట్టుబడిదారులను ఆకర్షించడానికి రాష్ట్రంలో ఎన్నో ప్లస్ పాయింట్లు ఉన్నాయని లోకేష్ గుర్తుచేశారు.
తమ హయాంలో పెట్టుబడులు తెచ్చేందుకు ఎంతగానో కృషి చేశామని లోకేశ్ అన్నారు. ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్లో మూడేళ్లుగా ఏపీ నెంబర్వన్ స్థానంలో ఉందని వ్యాఖ్యానించారు. ఆరోగ్యసూచిలో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో ఉందని చెప్పుకోవాలని ఆయన జగన్కు సూచించారు. దేశంలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడి కియా రూపంలో రాష్ట్రానికి వచ్చిందనే విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. నదుల అనుసంధానం చేసి నీటి కొరత లేకుండా చేశామని తెలిపారు. అలాగే వ్యవసాయవృద్ధి రేటులో నెంబర్వన్ రాష్ట్రమని పారిశ్రామిక వేత్తలకు చెప్పాలని లోకేష్ సీఎం జగన్ సూచించారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.