బాలకృష్ణ రెండో అల్లుడికి లైన్ క్లియర్... సీటు ఖాయం ?

అనూహ్యంగా లోకేశ్‌ను మంగళగిరి నుంచి బరిలోకి దింపాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంతో... బాలకృష్ణ రెండో అల్లుడు భరత్‌ పోటీకి దాదాపుగా లైన్ క్లియర్ అయినట్టే అని జిల్లా రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది

news18-telugu
Updated: March 13, 2019, 7:11 PM IST
బాలకృష్ణ రెండో అల్లుడికి లైన్ క్లియర్... సీటు ఖాయం ?
నందమూరి బాలకృష్ణ
  • Share this:
రాబోయే ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమైన బాలకృష్ణ రెండో అల్లుడు, విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు భరత్‌కు టీడీపీ టికెట్ దక్కుతుందా లేదా అనే అంశంపై కొద్ది రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోంది. భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి లోకేశ్ పోటీ చేస్తారని వార్తలు రావడంతో... ఇక భరత్‌కు విశాఖ ఎంపీగా పోటీ చేసే అవకాశం రానట్టే అనే ఊహాగానాలు వినిపించాయి. అయితే అనూహ్యంగా లోకేశ్‌ను మంగళగిరి నుంచి బరిలోకి దింపాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంతో... బాలకృష్ణ రెండో అల్లుడు భరత్‌ పోటీకి దాదాపుగా లైన్ క్లియర్ అయినట్టే అని జిల్లా రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

చంద్రబాబు తనయుడు లోకేశ్ మంగళగిరి నుంచి పోటీ చేయడం ఖాయం కావడంతో... భరత్‌కు విశాఖ ఎంపీ సీటు కేటాయించే విషయంలో ఇబ్బందేమీ ఉండకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే విశాఖ ఎంపీ స్థానాన్ని భరత్‌కు బదులుగా టీడీపీలో చేరతారని ప్రచారంలో ఉన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ లేదా మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇవ్వాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వీరిద్దరు బరిలో ఉండటానికి ఇష్టపడకపోతేనే భరత్ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తారని తెలుస్తోంది.

అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలకు కూడా పోటీ హోరాహోరీగా ఉంటుందనే భావనలో ఉన్న ఉన్న టీడీపీ ముఖ్యనేతలు... బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేతేనే బాగుంటుందనే అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే భరత్‌కు ఎంపీ సీటు ఇవ్వాలని బాలకృష్ణ గట్టిగా పట్టుబడుతున్న నేపథ్యంలో... ఎలాగైనా అతడికి ఎంపీ సీటు దక్కొచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి బాలకృష్ణ ఇద్దరు అల్లుళ్లు ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం దాదాపు ఖాయమైనట్టే అని అనిపిస్తోంది.

First published: March 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు