ఏపీలో అందుకే ఇసుక కొరత... నారా లోకేశ్ కామెంట్

భవన నిర్మాణ కార్మికుల నోటి దగ్గర కూడు లాక్కొని వైకాపా నేతలు అవినీతి కోటలు నిర్మిస్తున్నారని నారా లోకేశ్ ఆరోపించారు.

news18-telugu
Updated: November 13, 2019, 3:04 PM IST
ఏపీలో అందుకే ఇసుక కొరత... నారా లోకేశ్ కామెంట్
నారా లోకేష్ (File)
  • Share this:
సిమెంట్ కంపెనీల నుండి జే ట్యాక్స్ వసూలు అయ్యే వరకూ వరద కారణంగా ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిపోతూనే ఉంటుందని విమర్శించారు టీడీపీ నేత నారా లోకేశ్. వైకాపా ఇసుక మాఫియా లిస్ట్... ర్యాంపుల దగ్గర క్యూ కట్టిన ట్రాక్టర్లలా పెరుగుతూనే ఉందని ధ్వజమెత్తారు. భవన నిర్మాణ కార్మికుల నోటి దగ్గర కూడు లాక్కొని వైకాపా నేతలు అవినీతి కోటలు నిర్మిస్తున్నారని నారా లోకేశ్ ఆరోపించారు. ఏపీలో నెలకొన్న 'ఇసుక కృత్రిమ కొరత-అక్రమ రవాణా'పై ఈ నెల 14న చంద్రబాబు చేపట్టిన నిరసన దీక్ష నేపథ్యంలో విజయవాడలో విడుదల చేసిన 'ఇసుక అక్రమ రవాణా చరిత్ర'ను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

వరద వలనే ఇసుక దొరకడం లేదు అంటూ చిలక పలుకులు పలుకుతున్న జగన్ గారు భవన నిర్మాణ కార్మికులకు క్షమాపణలు చెప్పాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ గారి ఇసుకాసుర లీలలు బయటపడ్డాయన్న లోకేశ్.... వైకాపా ఇసుక దొంగలు అడ్డంగా దొరికారని అన్నారు. 5 నెలల్లో 42 మంది భవన నిర్మాణ కార్మికులని మింగేసిన పాపం వీరిని ఊరికే వదలదని హెచ్చరించారు.
First published: November 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading