సీఎం జగన్‌‌పై నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు

ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు నారా లోకేశ్ ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు.

news18-telugu
Updated: July 11, 2019, 5:52 PM IST
సీఎం జగన్‌‌పై నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు
నారా లోకేశ్(ఫైల్ పోటో)
  • Share this:
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీమంత్రి నారా లోకేశ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో సీఎం జగన్‌ వ్యాఖ్యలపై ట్విట్టర్‌లో లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం కడుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా అంటూ సీఎం జగన్‌ వ్యాఖ్యానించడాన్ని లోకేశ్ తప్పుబట్టారు. కాళేశ్వరంపై చంద్రబాబు ప్రభుత్వం.. కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయం అన్ని పత్రికల్లో వచ్చిందన్న లోకేశ్... ఇలాంటివి చూసే సమయం మీకు ఉండి ఉండదని అన్నారు. ఆ టైంలో తమరు గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారేమో అని లోకేష్‌ సీఎం జగన్‌ను ఎద్దేవాచేశారు.

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్న సమయంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు... ఆ ప్రాజెక్టును అడ్డుకోలేకపోయారని ప్రస్తుత ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చంద్రబాబు గాడిదలు కాశారా ? అంటూ ఏపీ సీఎం విమర్శలు చేశారు. కర్ణాటకలో ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచే సమయంలోనూ జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు కీలకంగా వ్యవహరిస్తున్నారని సీఎం జగన్ గుర్తు చేశారు. అప్పుడు ఆల్మట్టి ప్రాజెక్టును చంద్రబాబు అడ్డుకోలేకపోయారని వ్యాఖ్యానించారు. దీనిపై లోకేశ్ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు.


First published: July 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు