కేంద్రం అలా చేయదు... తెలంగాణకు వరమైందన్న లోకేశ్

గతంలో అనేక రాష్ట్రాలు పంపిన మండలి రద్దు, పునరుద్ధరణ తీర్మానాలు కేంద్రం వద్ద ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని లోకేశ్ అన్నారు

news18-telugu
Updated: January 26, 2020, 9:16 PM IST
కేంద్రం అలా చేయదు... తెలంగాణకు వరమైందన్న లోకేశ్
నారా లోకేష్
  • Share this:
ఏపీ సీఎం జగన్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన లోకేశ్... ఏపీ ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేస్తే మరో తుగ్లక్ నిర్ణయమవుతుందని వ్యాఖ్యానించారు. గతంలో అనేక రాష్ట్రాలు పంపిన మండలి రద్దు, పునరుద్ధరణ తీర్మానాలు కేంద్రం వద్ద ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని లోకేశ్ అన్నారు. రాష్ట్రం తీర్మానం పంపిందని వెంటనే కేంద్రం శాసనమండలిని రద్దు చేయదని వివరించారు. శాసనమండలిని ఎందుకు రద్దు చేస్తున్నారో కారణాలను కూడా ప్రభుత్వం చెప్పాలని తెలిపారు. రాష్ట్రపతి గెజిట్ వచ్చే వరకు మండలి ఉంటుందని లోకేశ్ స్పష్టం చేశారు. తన వైఫల్యాలకు మంత్రులను బలి చేసే పనిని సీఎం మొదలుపెట్టారని విమర్శించారు. దావోస్ సదస్సుకు రావాలని ఏపీకి ఆహ్వానం కూడా అందలేదని... మనకు వచ్చే పెట్టుబడులను తెలంగాణ తన్నుకుపోతోందని అన్నారు. ఏపీలోని పరిస్థితులు తెలంగాణకు వరంలా మారాయని లోకేశ్ తెలిపారు.
First published: January 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు