Home /News /politics /

NARA LOKESH COMMENTS ON AP CM YS JAGAN AK

కామెడీ పీస్‌... సీఎం జగన్‌పై లోకేశ్ సెటైర్లు

నారా లోకేష్ (ఫైల్)

నారా లోకేష్ (ఫైల్)

2004కి ముందు గిరిజనుల మనోభావాలకు, వారి మనుగడకు వ్యతిరేకంగా బాక్సైట్ తవ్వకాలు జరపబోమని చంద్రబాబు తేల్చి చెప్పారని నారా లోకేశ్ అన్నారు.

  ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి విమర్శలు గుప్పించారు. 2014లోనే తమ నేత చంద్రబాబు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాక్సైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులన్నీ రద్దు చేశారని అన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా బాక్సైట్ తవ్వకాలు రద్దు చేస్తున్నామని నాటకం ఆడటం, దానికి సాక్షి రాతలు చూస్తుంటే, సిగ్గు కూడా సిగ్గు పడుతుందని జగన్‌పై సెటైర్లు వేశారు. అదేదో సినిమాలో జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ అని కామెడీ చేసినట్లు, ఎత్తేసిన కేసులనే మళ్ళీ ఎత్తేయడం, ఇదివరకే రద్దు చేసిన వాటిని మళ్లీ మళ్ళీ రద్దు చేయడం లాంటివి కాకుండా ఏదైనా కొత్తగా ప్రయత్నించండని సీఎం జగన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
  మీరు ఇలాగే చేస్తే ప్రజల్లో కామెడీ పీస్ లాగ మిగిలిపోతారని జగన్‌ను ఉద్దేశించిన నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. 2004కి ముందు గిరిజనుల మనోభావాలకు, వారి మనుగడకు వ్యతిరేకంగా బాక్సైట్ తవ్వకాలు జరపబోమని చంద్రబాబు తేల్చి చెప్పారని నారా లోకేశ్ అన్నారు. కానీ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ నిర్ణయానికి తూట్లు పొడిచి రస్‌ ఆల్ ఖైమా సంస్థను బాక్సైట్ తవ్వకాల కోసం తీసుకొచ్చారని ఆరోపించారు.
  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Ap cm ys jagan mohan reddy, Chandrababu naidu, Nara Lokesh, Tdp, Ysrcp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు