‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న’చంద్రబాబుకు లోకేష్ విషెస్

రాబోయే రోజుల్లో మీరు ఇంతే ఉత్సాహంతో, శక్తివంతంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న’ అని లోకేష్ ట్వీట్ చేశారు.

news18-telugu
Updated: April 20, 2019, 3:17 PM IST
‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న’చంద్రబాబుకు లోకేష్ విషెస్
నారా లోకేశ్, చంద్రబాబు
news18-telugu
Updated: April 20, 2019, 3:17 PM IST
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు కుమారుడు నారా లోకేష్. తండ్రికి ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపారు. ‘ఓ విజనరీగా, ధైర్యవంతుడుగా ఉన్న మిమ్మల్ని నా తండ్రిగా పొందినందుకు నేనెంతో అదృష్టవంతుడిని. మీరు ప్రపంచానికి ఓ విజనరీగా మాత్రమే కాదు.. ఓ భర్తగా, తండ్రిగా, తాతగా మాపై అమితమైన ప్రేమ కురిపించారు. దేవాన్ష్‌తో కలిసి నాలుగేళ్ల పిల్లాడిలా పరుగులు తీశారు. రాబోయే రోజుల్లో మీరు ఇంతే ఉత్సాహంతో, శక్తివంతంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న’ అని ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, వైసీపీ అధినేత జగన్ సహా పలువురు రాజకీయ, ఇతర ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 20, 1950లో చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో జన్మించారు. అమ్మణమ్మ-ఖర్జూర నాయుడు ఆయన తల్లిదండ్రులు. 1972లో బీ.ఏ పూర్తి చేసిన ఆయన.. శ్రీ వెంకటేశ్వర యూనిర్సిటీ నుంచి ఎకనమిక్స్‌లో పీజీ పూర్తి చేశారు. 1978లో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

First published: April 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...