జగన్ పుట్టినరోజు సందర్భంగా నారా లోకేష్ ట్వీట్ ఇదే

ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ 47వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

news18-telugu
Updated: December 21, 2019, 10:17 AM IST
జగన్ పుట్టినరోజు సందర్భంగా నారా లోకేష్ ట్వీట్ ఇదే
నారా లోకేష్, వైఎస్ జగన్
  • Share this:
ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ 47వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాసేపటి క్రితమే ప్రధాని సైతం ట్విట్టర్ ద్వారా జగన్‌కు బర్త్‌డే విషెస్ తెలిపారు. మాజీ మంత్రి, మాజీ సీఎం తనయుడు నారా లోకేష్ కూడా సీఎం  పుట్టినరోజు సందర్భంగా ట్వీట్ చేశారు. ‘ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.

జగన్ ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల తర్వాత జరుపుకుంటున్న తొలి పుట్టిన రోజు ఇది కావడంతో... పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. హైవేలపై ఎక్కడ చూసినా వైసీపీ జెండాలే కనిపిస్తున్నాయి. మరోవైపు చేనేత కార్మికుల కష్టాల్ని తొలగించే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని కూడా జగన్ ఇవాళ ప్రారంభించనున్నారు. నేడు అనంతపురం జిల్లా ధర్మవరంలో పర్యటించనున్న ఏపీ సీఎం జగన్... 'వైఎస్సార్‌ నేతన్న నేస్తం' పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ధర్మవరంలో భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ సభపైనే జగన్ 47వ జన్మదిన వేడుకలు కూడా జరపనున్నట్లు తెలిసింది.



First published: December 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు