మా బాలా మావయ్య ఏ రోజూ అటువైపు చూడలేదంటున్న లోకేష్

Nara Lokesh | బాలకృష్ణ అమరావతిలో 500 ఎకరాల భూములు కొన్నారంటూ వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

news18-telugu
Updated: July 28, 2019, 7:44 PM IST
మా బాలా మావయ్య ఏ రోజూ అటువైపు చూడలేదంటున్న లోకేష్
నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్
  • Share this:
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్.. అధికార వైసీపీ మీద విరుచుపడ్డారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బావ అధికారాన్ని అడ్డుపెట్టుకుని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అమరావతిలో 500 ఎకరాలు కొనుగోలు చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్టు ఓ పేపర్‌లో వార్త వచ్చింది. ఆ పేపర్ క్లిప్పింగ్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన నారా లోకేష్.. అధికార వైసీపీ మీద విరుచుకుపడ్డారు. ‘వైకాపా నాయకులు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాం అనుకుంటున్నారు. వాళ్ళ ఫేక్ బతుకు మారలేదు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అసత్యాలతో కాలం నెట్టుకొస్తున్నారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని దెబ్బతియ్యడానికి ఇన్ సైడ్ ట్రేడింగ్ అంటూ బురద జల్లుతున్నారు.’ అని ఆరోపించారు. దీంతోపాటు బాలకృష్ణ నీతి, నిజాయితీలతో ఎదిగిన వ్యక్తి అని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి శవాన్ని పెట్టుబడిగా పెట్టి రాజకీయంగా ఎదిగారని, బాలకృష్ణ తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఏ రోజూ అటువైపు చూడకుండా నీతి, నిజాయితీలతో ఎదిగారని చెప్పారు. బాలయ్య అమరావతిలో భూములు కొన్నారని ఆరోపించే వైసీపీ నేతలు.. దమ్ముంటే వాటిని నిరూపించాలని లోకేష్ సవాల్ విసిరారు.First published: July 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు