ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు, మంత్రి నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేశారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో తన ఆస్తులు, అప్పుల వివరాలను నారా లోకేష్ ప్రకటించారు. తనపై ఎలాంటి కేసులు లేవని అఫిడవిట్లో పేర్కొన్నారు. నారా లోకేష్ స్థిర, చరాస్తుల మొత్తం రూ.320 కోట్లపైనే ఉంది. నారా బ్రాహ్మణి పేరు మీద రెండున్నర కేజీల బంగారం, 97 కేజీలకు పైగా వెండి ఉంది. అఫిడవిట్లో పేర్కొన్న ప్రకారం.. నారా లోకేష్, నారా బ్రాహ్మణి, నారా దేవాన్ష్ పేరిట ఉన్న స్థిర,చరాస్తులు, అప్పుల వివరాలు...
2008లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసినట్టు నారా లోకేష్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.