మంగళగిరిలో ఈసీ కుట్ర... ఇక్కడ నుంచి కదలబోనన్న లోకేశ్

నారా లోకేశ్ (File)

ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు కూడా సరిగ్గా నిర్వహించలేరా ? అని ఈసీపై లోకేశ్ విమర్శలు గుప్పించారు. గంటలపాటు క్యూలైన్లలో నిల్చున్న ఓటర్లను ఈసీ పశువులకన్నా హీనంగా చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Share this:
    మంగళగిరి నియోజకవర్గంలో ఓటింగ్ శాతం తగ్గించేందుకు ఎన్నికల సంఘం కుట్ర చేస్తోందని టీడీపీ యువనేత, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. గంటలపాటు ఈవీఎంలు మొరాయించినా అధికారులు పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. కావాలనే ఎన్నికల సంఘం స్వేఛ్చాయుతంగా ఎన్నికలు జరగకుండా చేస్తోందని మండిపడ్డారు. ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు కూడా సరిగ్గా నిర్వహించలేరా ? అని ఈసీపై లోకేశ్ విమర్శలు గుప్పించారు. గంటలపాటు క్యూలైన్లలో నిల్చున్న ఓటర్లను ఈసీ పశువులకన్నా హీనంగా చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం అధికారులు వచ్చి క్షమాపణలు చెప్పేంతవరకు ఇక్కడి నుంచి తాను కదలేది లేదని లోకేశ్ స్పష్టం చేశారు.

    బీజేపీ సహా అంతా కలిసి ఆంధ్రులపై దాడి చేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమైందని అన్నారు. పరిస్థితి ఇలా ఉంటే... అధికారులు ఎక్కడ ఉన్నారో కనిపించడం లేదని లోకేశ్ ఆరోపించారు. ఎన్నికల సంఘం మంగళగిరిలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఒంటి గంట వరకు ఏడు బూతుల్లో ఈవీఎంలు మొరాయించాయని లోకేశ్ తెలిపారు. తాను స్వయంగా 50 బూత్‌లు తిరిగానని తెలిపిన లోకేశ్... పది నిమిషాల్లో రిప్లేస్ చేయాల్సిన వీవీప్యాట్లను మార్చడానికి గంటల సమయం తీసుకున్నారని అన్నారు. మరోవైపు నారా లోకేశ్ ఆందోళనను నిరసిస్తూ వైసీపీ నేతలు కూడా ధర్నాకు దిగారు. టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

    First published: