మంగళగిరిలో లోకేష్... హిందూపురంలో బాలయ్యదే విజయమన్న ఎగ్జిట్ పోల్స్

ఏపీలో ఈసారి కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములపై హాట్ హాట్ చర్చలు... విశ్లేషణలు జరిగాయి. అందులో అతి ముఖ్యమైనది గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం.

news18-telugu
Updated: May 20, 2019, 10:09 AM IST
మంగళగిరిలో లోకేష్... హిందూపురంలో బాలయ్యదే విజయమన్న ఎగ్జిట్ పోల్స్
బాలకృష్ణ, నారా లోకేష్
  • Share this:
ఏపీ ఎగ్జిట్ పోల్స్ విడుదలతో చాలామంది నాయకులు ఆనందంలో మునిగిపోతున్నారు. మరికొందరు ఆందోళనలో నలిగిపోతున్నారు. ఏపీలో ఈసారి కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములపై హాట్ హాట్ చర్చలు... విశ్లేషణలు జరిగాయి. అందులో అతి ముఖ్యమైనది గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం. ఈసారి ఎన్నికల్లో మంగళగిరికి ఉన్న ప్రాధాన్యత మరే అసెంబ్లీ నియోజకవర్గానికి లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఎన్నికల బరిలోకి దిగడమే. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన లోకేష్ పోటీ చేసేందుకు మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఎన్నికల సందర్భంగా ఇక్కడ జోరుగా ప్రచారం కూడా నిర్వహించారు. కొందరు మంగళగిరిలో లోకేష్ గెలిచే సీన్ లేదంటూ కూడా విశ్లేషణలు చేశారు. ఇక పందాల రాయుళ్లు జోరుగా లోకేష్ గెలుపోటములపై బెట్టింగులు కూడా నిర్వహించారు. మంగళగిరిలో డబుల్ బెట్టింగ్స్ జోరుగా నడిచాయి. అయితే తాజాగా ఎన్నికల ఫలితాలపై వచ్చిన ఎగ్జిట్ పోల్స్ మంగళగిరిలో నారా లోకేష్ గెలుపు ఖాయమని చెబుతున్నాయి. ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ చేయించిన సర్వేలో మంగళగిరిలో టీడీపీయే గెలుస్తుందన్నారు.

మరోవైపు హిందూపురంలో కూడా టీడీపీకి అనుకూలంగానే ఫలితాలు వస్తాయన్నారు లగడపాటి. హిందూపురంలో టీడీపీ తరపున హీరో బాలకృష్ణ బరిలోకి దిగారు. తండ్రి ఎన్టీఆర్ ప్రాతినిథ్యం వహించిన హిందూపురం అసెంబ్లీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు బాలయ్య. తాజాగా ఇప్పుడు మరోసారి అక్కడ్నుంచే పోటీకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. హిందూపురం నియోజకవర్గంలో దాదాపు రెండు లక్షల 20 వేల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో బీసీ, మైనారిటీ ఓటర్లే ఎక్కువ. అభ్యర్ధుల గెలుపోటముల్లో వీరిదే కీలకపాత్ర. అయినా దశాబ్దాలుగా నందమూరి కుటుంబ సభ్యులను ఆదరించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. దీంతో నందమూరి కంచుకోటను బద్దలు కొట్టేందుకు వైసీపీ ఈసారి మైనార్టీ వర్గానికి చెందిన మాజీ పోలీసు అధికారి ఇక్బాల్ ను ఇక్కడ బరిలోకి దింపింది. అయితే ఈసారి ఎ‌న్నికల్లో బాలయ్యతో పాటు ఆయన భార్య వసుంధర కూడా ఎన్నికల ప్రచారం చేశారు. కచ్చితంగా బాలయ్యే గెలుస్తారని టీడీపీ శ్రేణులతో పాటు.... ఆయన అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇటు ఎగ్జిట్ పోల్స్ కూడా బాలయ్యకు అనుకూలంగా వచ్చాయి. మొత్తం మీద టీడీపీలో ఇద్దరు ముఖ్య నేతలు ఎగ్జిట్ పోల్స్ గెలుపు భరోసాను కల్గించాయి.First published: May 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు