జగన్ గారి మద్యం షాపుల్లో రేట్లు ఎక్కువే.. నారా లోకేష్

త్వరలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో తొలిదశలో 500 మద్యం దుకాణాలు ప్రారంభించాలని ఎక్సైజ్ శాఖ ప్రయత్నాలు చేస్తోంది.

news18-telugu
Updated: September 7, 2019, 6:45 PM IST
జగన్ గారి మద్యం షాపుల్లో రేట్లు ఎక్కువే.. నారా లోకేష్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. దశలవారీగా దాన్ని అమలు చేయనుంది. ఈ క్రమంలో బెల్ట్ షాపులను తగ్గించింది. ఇప్పటికే రాష్ట్రంలో చాలాచోట్ల బెల్ట్ షాపులు లేకుండా చేసేయాలని ఎక్సైజ్ అధికారులను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. త్వరలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో తొలిదశలో 500 మద్యం దుకాణాలు ప్రారంభించాలని ఎక్సైజ్ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. అయితే, ఈ సర్కారీ వైన్స్‌‌ మద్యం ధరలు ఎక్కువగా ఉంటాయని టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆరోపించారు. ‘ఇంకోపక్క సంపూర్ణ మద్యపాన నిషేధం అంటారు, మరోపక్క జగనన్న మద్యం దుకాణాలు తెరుస్తారు. వాటిలో సేల్స్ ఎక్కువ, ధర ఎక్కువ , ఆదాయం కూడా ఎక్కువే! జగన్ గారి మద్యం షాపుల్లో ఎవరి కంపెనీ బ్రాండ్ అయినా ఉండాలి అంటే 2 శాతం J- ట్యాక్స్ కట్టాల్సిందే !’ అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంద రోజలు పాలన మీద చంద్రబాబు, నారా లోకేష్, టీడీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. ‘తుగ్లక్ 2.0’ పేరుతో వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. ‘సన్నబియ్యం అంటే సన్నగా ఉన్న వ్యక్తిని పౌరసరఫరాల శాఖకి మంత్రిని చెయ్యడం మాత్రమే అని ఆలస్యంగా అర్థం చేసుకున్నాం. నాణ్యమైన బియ్యం అంటే మరీ ఇంత నాణ్యమైనవి అనుకోలేదు. పశువులు కూడా తినలేని బియ్యంలో వైకాపా మార్కు సంచుల దోపిడీ 750 కోట్లు.’ అని మరో ట్వీట్ చేశారు. వరదల్లో పంటలు మునిగిపోయిన రైతులకు రూపాయి కూడా సాయం చేయలేదంటూ జగన్ విదేశాలకు విహారయాత్రకు వెళ్లారని మండిపడ్డారు.
First published: September 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading