‘చంద్రబాబు అన్నం తినేటప్పుడు కూడా మిమ్మల్నే తలుచుకుంటున్నారు’

తుళ్లూరులో మహాధర్నాను నిర్వహించాలని రైతులు నిర్ణయించారు. వెలగపూడిలో 15వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు.

news18-telugu
Updated: January 1, 2020, 12:20 PM IST
‘చంద్రబాబు అన్నం తినేటప్పుడు కూడా మిమ్మల్నే తలుచుకుంటున్నారు’
నారా భువనేశ్వరి(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపి మాజీ సిఎం చంద్రబాబునాయుడు భార్య భువనేశ్వరి ఇవాళ రాజధాని ప్రాంతాల్లో పర్యటించారు. నిరసనలు తెలుపుతున్న రైతుల కుటుంబాలకు ఆమె సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ... చంద్రబాబు అన్నం తినేటప్పుడు, పడుకునేటప్పుడు కూడా మిమ్మల్నితలుచుకుంటున్నారు. ఆయనకు మీ తర్వాతే మేము. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని ఎంతగానే తపించారన్నారు. రాజధాని రైతులకు మద్దతుగా ఉంచామన్నారు. ప్రజల తర్వాత తనను, కుటుంబాన్ని చంద్రబాబు పట్టించుకునేవారన్నారు.

ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, మందడం గ్రామాల్లో భువనేశ్వరి పర్యటన కొనసాగింది. ఇవాల్టికి అమరావతి రైతుల పోరాటం 15వ రోజుకు చేరింది. తుళ్లూరులో మహాధర్నాను నిర్వహించాలని రైతులు నిర్ణయించారు. వెలగపూడిలో 15వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మరోవైపు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. ప్రకాశం జిల్లాలో జేఏసీ నేతృత్వంలో ధర్నా జరుగనుంది. ఇటు టీడీపీప అధినేత చంద్రబాబు తన నూతన సంవత్సరం వేడుకలను రద్దు చేసుకొని ఇవాళంతా అమరావతి రైతుల మధ్యే గడపాలని నిర్ణయించుకున్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: January 1, 2020, 12:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading