ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు కంగ్రాట్స్ చెబుతున్నట్టుగా ఓ కార్టూన్‌ను పోస్ట్ చేశారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. మే 23న ఎన్నికల ఫలితాల్లో వైసీపీ విక్టరీ తర్వాత ఆర్జీవీ చెలరేగిపోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మీద సెటైర్లు, పంచ్‌లో వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో పంచ్ వేశారు. సీనియర్ ఎన్టీఆర్ జగన్ మోహన్ రెడ్డికి కంగ్రాచ్యులేషన్స్ చెబుతున్నట్టుగా కార్టూన్‌ను పోస్ట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.