ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనకు ఆ పార్టీ మహిళా నేత, ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి మార్కులు వేశారు. జగన్ ఐదు నెలల పాలనకు 60 నుంచి 70 మార్కులు ఇవ్వొచ్చన్నారు. మే 30న ఏపీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. జగన్ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. తాను ఎప్పుడూ ఎన్టీఆర్ పాలనను జగన్‌తో పోల్చి చూడనన్నారు. కానీ, వైఎస్ పాలనతో పోల్చి చూస్తానని చెప్పారు. ‘జగన్ పాలనను వైఎస్‌తో పోల్చి చూస్తా. ఇప్పటికే ఎన్నో పథకాలు తెచ్చారు. కొన్ని అమలవుతున్నాయి. మిగిలినవి అమలు కావాలి. జగన్ మోహన్ రెడ్డి పాలన వంద శాతం ఎన్టీఆర్, వైఎస్ఆర్ అడుగుజాడల్లో నడుస్తుంది.’ అని లక్ష్మీపార్వతి అన్నారు.
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని లక్ష్మీపార్వతి ఆకాంక్షించారు. దానికి సంబంధించి సీఎం జగన్‌కు త్వరలో అప్లికేషన్ ఇస్తానన్నారు. ఆ విషయంలో జగన్ మోహన్ రెడ్డి తప్పకుండా తన మాట నెరవేరుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం కృషి చేయాలని సీఎం జగన్‌కు లేఖ రాస్తానని లక్ష్మీపార్వతి తెలిపారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.