news18-telugu
Updated: November 20, 2019, 7:32 PM IST
తెలుగుదేశం పార్టీ లోగో
ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్కు అంతగా ప్రాధాన్యత లేదని ఇటీవల ప్రచారం మొదలైంది. ఏపీ మంత్రి కొడాలి నాని, టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జూనియర్ ఎన్టీఆర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లోనూ సంచలన సృష్టించాయి. ఎన్టీఆర్ను టీడీపీ అధినేత చంద్రబాబు కావాలనే పక్కనపెట్టారని వంశీ, నాని ఆరోపించారు. దీనిపై టీడీపీ నేరుగా స్పందించకపోయినా... జూనియర్ ఎన్టీఆర్ అవసరం తమకు లేదని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఇదంతా ఎలా ఉన్నా... తాజాగా టీడీపీలోకి మరో నందమూరి వారసుడు ఎంట్రీ ఇవ్వనున్నాడనే ఊహాగానాలు మొదలయ్యాయి.
ఎన్టీఆర్ తనయుడు నందమూరి జయకృష్ణ కుమారుడైన నందమూరి చైతన్య కృష్ణ టీడీపీలోకి రానున్నారనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీకి చెందిన మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు అనవసర విమర్శలు చేస్తున్నారంటూ చైతన్య కృష్ణ మండిపడ్డారు. పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించిన వ్యక్తిపై వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని ఆయన సూచించారు. కొడాలి నాని, వంశీ ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నారంటే దానికి కారణం చంద్రబాబే అని చైతన్య కృష్ణ వ్యాఖ్యానించడం విశేషం. అది మరిచి నోటి కొచ్చినట్లు దూషిస్తే సహించేది లేదని ఆయన అన్నారు.

బాలకృష్ణతో చైతన్యకృష్ణ(ఫైల్ ఫోటో)
అయితే ఉన్నట్టుండి వంశీ,నానికి కౌంటర్ ఇచ్చేందుకు చైతన్యకృష్ణ తెరపైకి రావడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది. నందమూరి వారసుడిని అడ్డుపెట్టుకుని వంశీ, నాని చేస్తున్న విమర్శలకు... నందమూరి వారసుడితోనే కౌంటర్ ఇప్పించాలని ఆయన భావించి ఉంటారని పలువురు చర్చించుకుంటున్నారు. మరి వంశీ, నానిలకు కౌంటర్ ఇచ్చిన చైతన్య కృష్ణ... టీడీపీలో యాక్టివ్ అవుతారేమో చూడాలి.
Published by:
Kishore Akkaladevi
First published:
November 20, 2019, 7:17 PM IST