NANDAMURI BALAKRISHNAS SON IN LAW SRI BHARAT LIKELY TO BE TDP TELUGU YUVATHA PRESIDENT REPORT BA
Nandamuri Balakrisna: ఆ పదవి బాలకృష్ణ రెండో అల్లుడికేనా? టీడీపీలో చర్చ..
బాలకృష్ణ, శ్రీ భరత్
బాలయ్య రెండో అల్లుడు శ్రీ భరత్‌కు తెలుగు యువత అధ్యక్షుడు పదవి బాధ్యతలు అప్పగించాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు.. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వద్ద ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది.
నందమూరి బాలకృష్ణ రెండో అల్లుడు శ్రీ భరత్‌కు తెలుగుదేశం పార్టీలో కీలక పదవి లభించబోతున్నట్టు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. బాలయ్య రెండో అల్లుడు శ్రీ భరత్‌కు తెలుగు యువత అధ్యక్షుడు పదవి బాధ్యతలు అప్పగించాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు.. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వద్ద ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. శ్రీ భరత్ 2019లో జరిగిన ఎన్నికల్లో విశాఖ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. దేవినేని అవినాష్ గతంలో తెలుగుయువత అధ్యక్షుడిగా ఉండేవారు. ఆయన టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఆ ప్లేస్‌లో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడును నియమించాలని మొదట్లో చర్చించారు. అయితే, అచ్చెన్నాయుడు టీడీపీ అధ్యక్షుడు కావడంతో ఇక తెలుగుయువత అధ్యక్షుడు పదవి కూడా అదే కుటుంబానికి చెందిన నేతకు ఇవ్వకుండా ఆపారు. అయితే, విశాఖలో గీతం విద్యాసంస్థలను నడుపుతున్న శ్రీభరత్‌కు అప్పగించాలని అచ్చెన్నాయుడు చంద్రబాబు వద్ద ఒత్తిడి తెచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
త్వరలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం ఇప్పటి నుంచే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పెద్ద ఎత్తున వ్యూహాలను రచిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే టీడీపీకి చెందిన కీలక నేతలను వ్యూహాత్మకంగా ఇరుకున పెట్టేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఓ ఎమ్మెల్యే వైసీపీలో చేరారు. గంటా శ్రీనివాసరావు పార్టీకి దూరంగా ఉన్నారు. ఇక వెలగపూడి రామకృష్ణ చుట్టూ కూడా వైసీపీ ఈ మధ్య ఎదురుదాడి చేసింది.
ఇలాంటి సమయంలో పార్టీలో మళ్లీ జోష్ నింపాలంటే శ్రీభరత్‌కు పగ్గాలు అప్పగించాలని అచ్చెన్నాయుడు చంద్రబాబుకు సూచించినట్టు టీడీపీలో చర్చ జరుగుతోంది. అయితే, శ్రీభరత్ నిర్వహిస్తున్న గీతం యూనివర్సిటీ మీద కూడా వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. గతంలో ఆ యూనివర్సిటీ ఆక్రమణలు చేపట్టిందంటూ గోడను కూల్చేసింది. అదే సమయంలో గీతం యూనివర్సిటీ పై కేంద్రానికి ఫిర్యదు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.
విద్యాసంస్థలను నిర్వహిస్తున్న శ్రీభరత్ రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్‌గా కనపడలేదు. ఎన్నికలకు ముందు మాత్రమే ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఇప్పుడు శ్రీభరత్‌కు పదవి ఇస్తే ఆయన ఎంత యాక్టివ్‌గా ఉంటారనే చర్చ కూడా జరుగుతోంది. అదే సమయంలో రెండు పదవులు ఉత్తరాంధ్ర నేతలకే ఇస్తే మరి మిగిలిన ప్రాంతాలకు ఎలాంటి న్యాయం చేస్తారనే చర్చ కూడా టీడీపీలో జరుగుతోంది. దీనిపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.