Nandamuri Balakrishna: చాలాకాలంగా చాలామంది మదిలో ఉన్న ప్రశ్నలకు బాలకృష్ణ సమాధానాలు చెప్పడం ఆసక్తికరంగా మారింది. నిజానికి ఈ షోలో అలాంటి ప్రశ్నలు వస్తాయని ఎవరూ ఊహించలేదు. ఇలాంటి ప్రశ్నలకు ఇన్నేళ్ల తరువాత బాలయ్య నుంచి సమాధానాలు వస్తాయని కూడా ఎవరూ ఆశించలేదు.
బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షోకు స్పందన బాగానే ఉంది. ఈ షోకు వచ్చే అతిథుల కంటే బాలకృష్ణ చేసే ఎంటర్టైన్మెంట్ మీదే అందరి దృష్టి ఉంది. బాలకృష్ణ టాక్ షోను ఎలా నిర్వహిస్తారని సందేహించిన చాలామంది... బాలయ్య టాక్ షోలో కూడా అదరగొడుతున్నారని మురిసిపోతున్నారు. అయితే టాక్ షో సందర్భంగా బాలకృష్ణ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. అందులో మొదటి షో సందర్భంగా వచ్చిన అతిథి మోహన్ బాబు.. బాలకృష్ణను రాజకీయాల గురించి ప్రశ్నించారు. టీడీపీకి మీరు ఎందుకు నాయకత్వం వహించలేదని సూటిగానే అడిగారు. అందుకే బాలకృష్ణ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో వారసత్వ రాజకీయాలు ఉన్నాయని.. వాటికి వ్యతిరేకంగా ఉండాలని ఎన్టీఆర్ భావించారని.. ఈ క్రమంలోనే చంద్రబాబు టీడీపీకి నాయకత్వం వహించారని చెప్పుకొచ్చారు.
బాలకృష్ణ చెప్పిన ఈ సమాధానంతో ఎంతమంది అభిమానులు, టీడీపీ కార్యకర్తలు సంతృప్తి చెందారనే చర్చ పక్కనపెడితే.. చాలామంది మదిలో ఉన్న ప్రశ్నకు బాలకృష్ణ సమాధానం చెప్పేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ టాక్ షోకు సంబంధించి వస్తున్న కొత్త ప్రోమో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన అంశంపై బాలకృష్ణ రియాక్ట్ కావడం ఆసక్తికరంగా మారింది. అది వెన్నుపోటు కాదని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు బాలయ్య. అయితే ఆయన ఈ అంశంపై ఏం చెప్పారనే విషయం తెలియాలంటే ఈ టాక్ షో నయా ఎపిసోడ్ రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.
అయితే చాలాకాలంగా చాలామంది మదిలో ఉన్న ప్రశ్నలకు బాలకృష్ణ సమాధానాలు చెప్పడం ఆసక్తికరంగా మారింది. నిజానికి ఈ షోలో అలాంటి ప్రశ్నలు వస్తాయని ఎవరూ ఊహించలేదు. ఇలాంటి ప్రశ్నలకు ఇన్నేళ్ల తరువాత బాలయ్య నుంచి సమాధానాలు వస్తాయని కూడా ఎవరూ ఆశించలేదు. కానీ బాలకృష్ణ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అప్పట్లో జరిగిన ఘటనలకు ఇప్పుడు సమాధానం చెప్పి.. అప్పట్లో జరిగిదంతా సరైందే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఇందుకు ఆయన తాను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షోను ఫుల్లుగా వాడుకుంటున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. టీడీపీకి నాయకత్వం వహించకపోవడం, ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్‌పై స్పందించిన బాలకృష్ణ.. రాబోయే ఎపిసోడ్లలో మరిన్ని అంశాలపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని.. అయితే అవి ఎలాంటి ప్రశ్నలు అని ఇప్పుడే చెప్పడం కష్టమనే టాక్ వినిపిస్తోంది. చూస్తుంటే.. ఆహా టాక్ షో ద్వారా చాలా నుంచి అభిమానుల మదిలో ఉన్న ప్రశ్నలకు బాలయ్య సమాధానం చెబుతున్నట్టు అర్థమవుతోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.