బాలయ్యను చుట్టుముట్టిన మరో వివాదం.. ఈసారి

1.55 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో బాలయ్య ఆ వీడియో జర్నలిస్ట్‌ను బెదిరిస్తున్నట్టుగా ఉంది.

news18-telugu
Updated: March 29, 2019, 3:13 PM IST
బాలయ్యను చుట్టుముట్టిన మరో వివాదం.. ఈసారి
నందమూరి బాలకృష్ణ
  • Share this:
హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన ఓ టీవీ వీడియో జర్నలిస్ట్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో బాలయ్య ఓ వీడియో జర్నలిస్ట్ మీద గట్టిగా అరుస్తున్నారు. బాలయ్యకు సంబంధించిన ఓ వీడియోను ఆ వ్యక్తి షూట్ చేసినట్టుగా కనిపిస్తోంది. అయితే, అతను తీసియ వీడియో ఏంటనేది మాత్రం తెలియలేదు. 1.55 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో బాలయ్య ఆ వీడియో జర్నలిస్ట్‌ను బెదిరిస్తున్నట్టుగా ఉంది. ‘ఎరేజ్ చెయ్... మా బతుకులు మీ చేతుల్లో ఉన్నాయా? నరికి పోగులు పెడతా? ప్రాణం తీస్తా? బాంబులు వేయడం కూడా తెలుసు. కత్తి తిప్పడం కూడా తెలుసు.’ అని కామెంట్ చేస్తూ కారు ఎక్కుతున్న దృశ్యాలు ఉన్నాయి.

నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా మరోసారి పోటీ చేస్తున్నారు. ఆయన పెద్ద అల్లుడు నారా లోకేష్ మంగళగిరి నుంచి అసెంబ్లీకి, రెండో అల్లుడు శ్రీభరత్ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసం బాలకృష్ణ రంగంలోకి దిగారు.


First published: March 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...