ఎన్టీఆర్ అవసరం టీడీపీకి లేదు.. బాలయ్య చిన్నల్లుడు భరత్ సంచలన వ్యాఖ్యలు..

జూనియర్ ఎన్టీఆర్ పై బాలకృష్ణ చిన్నల్లుడు భరత్.. సంచలన వ్యాఖ్యలు చేసాడు. తాజాగా ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూ ఎన్టీఆర్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: August 25, 2019, 5:35 PM IST
ఎన్టీఆర్ అవసరం టీడీపీకి లేదు.. బాలయ్య చిన్నల్లుడు భరత్ సంచలన వ్యాఖ్యలు..
జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య చిన్నల్లుడు భరత్ (File Photo)
news18-telugu
Updated: August 25, 2019, 5:35 PM IST
జూనియర్ ఎన్టీఆర్ పై బాలకృష్ణ చిన్నల్లుడు భరత్.. సంచలన వ్యాఖ్యలు చేసాడు. తాజాగా ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూ ఎన్టీఆర్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ.. ఎన్నడు లేనట్టుగా తీవ్ర సంక్షోభంలో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నడు లేనట్టుగా ఏపీలో కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు తెలంగాణలో ఒకపుడు మంచి క్యాడర్ ఉన్న పార్టీ ఇక్కడ దిక్కులేని పరిస్థితి ఎదుర్కొంటుంది. మొన్నటి వరకు తెలంగాణలో టీడీపీని ఖాళీ చేసింది టీఆర్‌ఎస్. మిగిలి ఉన్న తెలుగు దేశం పార్టీని క్యాడర్‌ను బీజేపీ లాక్కునే ప్రయత్నంలో ఉంది. మరోవైపు ఏపీలో తెలుగు దేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు నలుగురిని ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో బీజేపీ తన పార్టీలో చేర్చుకుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని కాపాడడానికీ జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఉందని చాలా మంది తెలుగు దేశం పార్టీ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలుగు దేశం నేత నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్.. తాజాగా ఎన్టీఆర్ అవసరం టీడీపీ అవసరం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. అంతేకాదు ఆయన అవసరం రాదంటూనే ఇప్పటి వరకు పార్టీని నడిపిన నాయకులు సమర్థులు కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది అంటూ కామెంట్స్ చేసాడు.
మరోవైపు పెద్ద  ఎన్టీఆర్ స్టాపించిన పార్టీలో ఆయన మనవడైన జూనియర్ ఎన్టీఆర్‌ను కలుపుకునే పోయే అవసరం పార్టీకి లేదా అంటూ యాంకర్ సంధించిన ప్రశ్నలకు భరత్ సమాధానమిస్తూ... ఎన్టీఆర్‌కు ఎంతో మంది పిల్లలు, మనవలు, మనవరాళ్లు ఉన్నారు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్‌కు రాజకీయాల్లో రావాలనుకుంటే.. పార్టీ అధ్యక్షుడితో మాట్లాడి వాళ్లిద్దరు చర్చించుకొని రావచ్చంటూ చెప్పుకొచ్చాడు. తన అభిప్రాయం ప్రకారం టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదన్నాడు. ఆయన ఉంటూనే పార్టీ బాగుంటుందని నేను అనుకోవడం లేదంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం టీడీపీలో నాయకులతోనే పార్టీని మరింత బిల్డ్ చేసుకుంటామంటూ సమాధానమిచ్చాడు. మరోవైపు పెద్ద ఎన్టీఆర్ వచ్చినపుడు అంతా కొత్తవాళ్లతోనే పార్టీని నిర్మించారంటూ చెప్పుకొచ్చాడు.
First published: August 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...