Home /News /politics /

Nandamuri Balakrishna: వైఎస్ జగన్ సర్కార్‌పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. త్వరలోనే రోడ్లమీదకు..

Nandamuri Balakrishna: వైఎస్ జగన్ సర్కార్‌పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. త్వరలోనే రోడ్లమీదకు..

బాలకృష్ణ, వైఎస్ జగన్

బాలకృష్ణ, వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్(YS Jagan) సర్కార్‌ పాలనపై ఆయన మండిపడ్డారు.

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్(YS Jagan) సర్కార్‌ పాలనపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు. నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులతో ఆదివారం బాలకృష్ణ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఫోన్ ద్వారానే ఆయన పంచాయతీ ఎన్నికలపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. కావలి మండలం రుద్రకోటలో టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఫోన్‌తో టీడీపీ కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడారు. రాష్ట్రంలో సాగుతున్న పాలన ఉత్తర భారతంలో కనిపించేదని వ్యాఖ్యానించారు. అభిమానులు, టీడీపీ కార్యకర్తలతో తనది జన్మజన్మల అనుబంధమని ఈ సందర్భంగా బాలకృష్ణ చెప్పారు. ఎవరికి ఇబ్బంది వచ్చిన ఊరుకోబోమని అన్నారు. సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత రోడ్లమీదకు వస్తానని కార్యకర్తలకు తెలిపారు. ప్రజలందరినీ కలవనున్నట్టు వెల్లడించారు.

    ఇక, ఇటీవల హిందూపురంలో పర్యటించిన బాలకృష్ణ ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హిందూపురం పర్యటనలో తనను వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంపై సీరియస్ అయిన బాలయ్య.. నేను ఒక్క సైగ చేస్తే...ఏమయ్యేదంటూ సీరియస్ అయ్యారు. కక్ష సాధింపు చర్యలతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందన్నారు బాలకృష్ణ. తండ్రి మండలిని పునరుద్ధరిస్తే.. కుమారుడు రద్దు చేస్తున్నాడంటూ జగన్‌పై సెటైర్లు వేశారు బాలయ్య.

    ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. ఈ చిత్రాన్ని మే 28న విడుదల కానుందని చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆ రోజు ఎన్టీఆర్ జయంతి కావడంతో అదే రోజు సినిమాను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక, మరోవైపు సినిమా షూటింగ్ గ్యాప్‌లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Ap cm ys jagan mohan reddy, Nandamuri Balarkrishna

    తదుపరి వార్తలు