Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    సీఎం జగన్ ప్రభుత్వంపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు..

    జగన్ ప్రభుత్వం ఐదేళ్లు పాలన పూర్తి చేసుకోదని త్వరలోనే కూలిపోతుందని నందమూరి బాలకృష్ణ అన్నారు.

    news18-telugu
    Updated: May 28, 2020, 4:44 PM IST
    సీఎం జగన్ ప్రభుత్వంపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు..
    బాలకృష్ణ, వైఎస్ జగన్
    • Share this:
    ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం ఐదేళ్లు పాలన పూర్తి చేసుకోదని త్వరలోనే కూలిపోతుందన్నారు. టీడీపీ మహానాడులో రెండో రోజు బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఒక్క చాన్స్ అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారో చూడండి. ఈ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగదు. టీడీపీ కచ్చితంగా త్వరలోనే అధికారంలోకి వస్తుంది. రాష్ట్రంలో అధికార పార్టీ చేస్తున్న ఆగడాలకు అందరూ భయపడిపోతున్నారు.’ అని బాలకృష్ణ అన్నారు. దీంతోపాటు టీడీపీ కార్యకర్తలే ఎన్టీఆర్‌కు నిజమైన వారసులు అని అన్నారు. ‘ఎన్టీఆర్ వారసులం మేం కాదు. టీడీపీ కార్యకర్తలే ఆయన అసలైన వారసులు.’ అని బాలయ్య వ్యాఖ్యానించారు. జూమ్ యాప్ ద్వారా నిర్వహించిన మహానాడులో బాలకృష్ణ చంద్రబాబు మీద పొగడ్తల వర్షం కురిపించారు. చంద్రబాబు ఎన్నోపథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. తన ఊపిరి ఉన్నంత కాలం టీడీపీ అభివృద్ది కోసం కృషి చేస్తానన్నారు.
    Published by: Ashok Kumar Bonepalli
    First published: May 28, 2020, 4:44 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading