అక్కడ రాజకీయాలకు నో అంటున్న బాలకృష్ణ... కారణం ఇదే

క్యాన్సర్ ఆస్పత్రిలో జరిగే కార్యక్రమాల్లో కచ్చితంగా పాల్గొనే బాలకృష్ణ... అక్కడ కొన్నిసార్లు రాజకీయాల గురించి కూడా మాట్లాడుతుంటారు.

news18-telugu
Updated: February 18, 2020, 2:03 PM IST
అక్కడ రాజకీయాలకు నో అంటున్న బాలకృష్ణ... కారణం ఇదే
బాలకృష్ణ (ఫైల్ ఫోటో)
  • Share this:
సినిమాలతో పోలిస్తే రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడంలో బాలకృష్ణ అంతగా సక్సెస్ కాలేకపోతున్నారనే చెప్పాలి. అయితే రాజకీయాలపరంగా అప్పుడప్పుడు ఆయన మాట్లాడే కొన్ని అంశాలు హైలెట్ అవుతుంటాయి. కొన్నిసార్లు ఆయన వ్యవహారశైలి కూడా టీడీపీకి, ఆయనకు ఇబ్బందిగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాజకీయాల్లో ఉన్నా రాజకీయాల గురించి సాధ్యమైనంత తక్కువగా మాట్లాడే బాలకృష్ణ... తాను చైర్మన్‌గా వ్యవహరిస్తున్న క్యాన్సర్ ఆస్పత్రిలో మాత్రం రాజకీయాల గురించి మాట్లాడేందుకు నో చెబుతున్నట్టు తెలుస్తోంది.

క్యాన్సర్ ఆస్పత్రిలో జరిగే కార్యక్రమాల్లో కచ్చితంగా పాల్గొనే బాలకృష్ణ... అక్కడ కొన్నిసార్లు రాజకీయాల గురించి కూడా మాట్లాడుతుంటారు. కొన్నిసార్లు అదే హైలెట్ అవుతుండటంతో... ఆ కార్యక్రమం అసలు ఉద్దేశ్యం నెరవేరడం లేదనే భావన ఆస్పత్రి వర్గాల్లో వ్యక్తమైనట్టు సమాచారం. ఇదే విషయాన్ని కొందరు బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లడంతో... ఆస్పత్రిలో జరిగే కార్యక్రమాల్లో ఇకపై వేరే అంశాలు మాట్లాడబోనని బాలకృష్ణ స్పష్టం చేశారని తెలుస్తోంది.

కొందరు మీడియా ప్రతినిధులు రాజకీయాల గురించి మాట్లాడినా... అవన్నీ తరువాత అని స్పష్టంగా చెబుతున్నారట బాలయ్య. ఇది చూసిన ఆస్పత్రివర్గాలు... బాలయ్య ఇకపై హాస్పిటల్‌లో రాజకీయాల గురించి మాట్లాడబోరని హ్యాపీగా ఫీలవుతున్నారట. మొత్తానికి క్యాన్సర్ ఆస్పత్రి కాంపౌండ్‌లో ఉన్నంతవరకు రాజకీయాల గురించి మాట్లాడొద్దని డిసైడయిన బాలకృష్ణ... ఈ నియమాన్ని ఎంతగా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతారో చూడాలి.First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు