ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు.. వైసీపీ ఎమ్మెల్యేకు బాలకృష్ణ అభినందనలు

రాజమండ్రి నుంచి కొత్తగా కొనుగోలు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహం ముసునూరుకు చేరుకోవడంతో విగ్రహాన్ని ప్రతిష్టించే పనులు జరుగుతున్నాయి.

news18-telugu
Updated: July 24, 2020, 1:06 PM IST
ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు.. వైసీపీ ఎమ్మెల్యేకు బాలకృష్ణ అభినందనలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నెల్లూరు జిల్లా కావలిలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు వివాదం కొలిక్కి వస్తోంది. నగరంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం పక్కన ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసే పనులు కొనసాగుతున్నాయి. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి వాస్తవ పరిస్థితులను సినీ హీరో బాలకృష్ణకు వాట్సాప్‌ ద్వారా తెలియజేయడంతో బాలకృష్ణ నేరుగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి ఫోన్‌ చేసి మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడిన అనంతరం బాలకృష్ణ ఎమ్మెల్యే తీసుకొన్న చొరవను అభినందించినట్లు తెలిపారు. ఇదే విషయాన్ని బాలకృష్ణ టీడీపీనేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి తెలియజేసినట్లు తెలుస్తోంది.



మరోవైపు రాజమండ్రి నుంచి కొత్తగా కొనుగోలు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహం ముసునూరుకు చేరుకోవడంతో విగ్రహాన్ని ప్రతిష్టించే పనులు జరుగుతున్నాయి. పక్కనే ఉన్న మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద కూడా శిథిలమైన దిమ్మెను మెరుగుపరుస్తున్నారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చెప్పినట్లుగానే విగ్రహాన్ని ముసునూరు కూడలిలోని బస్‌షెల్టర్‌ వద్దనే ఏర్పాటు చేస్తున్నారు.
Published by: Kishore Akkaladevi
First published: July 24, 2020, 1:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading