బాలకృష్ణ కొత్త కోరిక.. సీఎం జగన్‌కు చిక్కులు ?

హిందూపురంను జిల్లాగా ప్రకటించినా... జిల్లా కేంద్రంగా కర్ణాటక సరిహద్దుకు దగ్గరగా ఉండే హిందూపురంను ప్రకటించే అవకాశాలు దాదాపుగా ఉండకపోవచ్చనే వాదన ఉంది.

news18-telugu
Updated: July 14, 2020, 8:07 AM IST
బాలకృష్ణ కొత్త కోరిక.. సీఎం జగన్‌కు చిక్కులు ?
బాలకృష్ణ, వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ సీఎం జగన్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టారని ఏపీ రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సోమవారం సీఎం జగన్‌కు రెండు లేఖలు రాసిన బాలకృష్ణ... హిందూపురానికి మెడికల్ కాలేజీని మంజూరు చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇదే సమయంలో తన నియోజకవర్గమైన హిందూపురం పట్టణాన్ని కొత్త జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఆయన కోరడం హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టబోతోందనే ప్రచారం నేపథ్యంలో బాలకృష్ణ సీఎం జగన్‌కు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

నిజానికి అనంతపురం జిల్లాల్లో ఉన్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో హిందూపురం ఒకటి. హిందూపురంను జిల్లాగా ప్రకటించినా... జిల్లా కేంద్రంగా కర్ణాటక సరిహద్దుకు దగ్గరగా ఉండే హిందూపురంను ప్రకటించే అవకాశాలు దాదాపుగా ఉండకపోవచ్చనే వాదన ఉంది. అయితే తమ ప్రాంత సెంటిమెంట్‌ను గమనించి బాలకృష్ణ ముందుగానే ఈ డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చి ఉంటారని పలువురు చర్చించుకుంటున్నారు. ఏపీలోని లోక్ సభ నియోజకవర్గాల ప్రాతిపదికగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్న జగన్ సర్కార్... జిల్లా కేంద్రాల విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

అయితే లోక్ సభ నియోజకవర్గంను జిల్లాగా మార్చినా... నియోజకవర్గంలో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే పట్టణాన్నే జిల్లా కేంద్రంగా మార్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ఏదేమైనా... హిందూపురం జిల్లా విషయంలో ముందుగానే సీఎం జగన్‌ ముందు ప్రతిపాదన ఉంచిన బాలకృష్ణ... మరికొంతమంది నేతలకు ఈ విషయంలో ఆదర్శంగా మారే అవకాశం లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది.
Published by: Kishore Akkaladevi
First published: July 14, 2020, 8:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading