నందమూరి బాలకృష్ణ కీలక నిర్ణయం.. ఫ్యాన్స్‌కు నిరాశేనా?

Nandamuri Bala Krishna | ప్రస్తుతం ఉన్న పొలిటికల్ ఈక్వేషన్స్‌ను దృష్టిలో పెట్టుకుని.. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీని బలోపేతం చేయాలంటే బాలయ్యతోనే అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.

news18-telugu
Updated: July 5, 2019, 5:37 PM IST
నందమూరి బాలకృష్ణ కీలక నిర్ణయం.. ఫ్యాన్స్‌కు నిరాశేనా?
గత అసెంబ్లీ ఎన్నికల్లో రాప్తాడు నుంచి పోటీ చేసి ఓడిపోయిన పరిటాల శ్రీరామ్‌కు ఇటీవల కాలంలో ధర్మవరం బాధ్యతలు కట్టెబట్టింది కూడా బాలయ్యే.
  • Share this:
నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజకీయాల మీద కొంచెం ఎక్కువ దృష్టి పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. అందు కోసం సినిమాలకు కూడా కొంచెం బ్రేక్ ఇచ్చే చాన్స్ ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం బాలకృష్ణ... కేఎస్ రవికుమార్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. బోయపాటి శ్రీను, వీవీ వినాయక్‌తో సినిమాలు కమిట్ అయ్యాడు. కానీ, కేఎస్ రవికుమార్‌తో సినిమా పూర్తయిన తర్వాత కొంతకాలం రాజకీయాల మీద దృష్టి పెట్టి.. మళ్లీ కొన్నాళ్ల తర్వాత ముఖానికి మేకప్ వేసుకునే ప్లాన్‌లో బాలయ్య ఉన్నట్టు సమాచారం. సాధారణంగా బాలయ్య సినిమా మూడు, నాలుగు నెలల్లో పూర్తయిపోతుంది. ఈ క్రమంలో వచ్చే ఐదేళ్ల వరకు ఏడాదికో సినిమా మాత్రమే చేసి.. మిగిలిన సమయాన్ని పార్టీ కోసం కేటాయించాలని బాలయ్య భావిస్తున్నారట.

బోయపాటి శ్రీను కెమెరా స్విచ్ఛాన్ చేయగా..ఎ.కోదండరామి రెడ్డి గౌరవ దర్శకత్వం


బాలకృష్ణ ఇంతటి కీలక నిర్ణయం తీసుకోవడం వెనుక కూడా పెద్ద కారణం ఉంది. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు టీడీపీకి ఏమాత్రం అనుకూలంగా లేవు. పార్టీ నేతలు కూడా ఎప్పుడు ఎవరు పార్టీకి గుడ్ బై చెబుతారో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అలాంటి సమయంలో నందమూరి కుటుంబం నుంచి బాలయ్య పార్టీ బాధ్యతలను భుజాన వేసుకుని ముందుకు వెళ్లనున్నాడు. ప్రధానంగా రాయలసీమలో బాలకృష్ణకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. గత ఎన్నికల్లో వైసీపీ రాయలసీమలోని కడప, కర్నూలు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు మాత్రమే గెలిచారు. అనంతపురం జిల్లాలో హిందూపురం నుంచి బాలయ్య, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ గెలిచారు.

నందమూరి బాలకృష్ణ


ప్రస్తుతం ఉన్న పొలిటికల్ ఈక్వేషన్స్‌ను దృష్టిలో పెట్టుకుని.. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీని బలోపేతం చేయాలంటే బాలయ్యతోనే అవుతుందని చంద్రబాబు కూడా భావించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే బాలయ్య సినిమాలు తగ్గించి రాజకీయాల మీద మరింత ఫోకస్ చేస్తారని చెబుతున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 5, 2019, 5:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading