లోకేశ్ విషయంలో చర్చే ఉండదన్న బాలకృష్ణ

చంద్రబాబు తరువాత టీడీపీని ముందుకు నడిపించే సత్తా లోకేశ్‌కు లేదనే ప్రచారం జరిగింది.

news18-telugu
Updated: June 9, 2020, 8:42 PM IST
లోకేశ్ విషయంలో చర్చే ఉండదన్న బాలకృష్ణ
బాలకృష్ణ, లోకేశ్(Image: Twitter)
  • Share this:
చంద్రబాబు తరువాత టీడీపీని నడిపించేది ఎవరనే దానిపై కొంతకాలంగా చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో... చంద్రబాబు తనయుడు, టీడీపీ యువనేత నారా లోకేశ్ నాయకత్వం లక్షణాలపై పెద్ద చర్చే జరిగింది. చంద్రబాబు తరువాత టీడీపీని ముందుకు నడిపించే సత్తా లోకేశ్‌కు లేదనే ప్రచారం జరిగింది. వైసీపీ నేతలు సైతం లోకేశ్‌ను ఈ విషయంలో అనేక సందర్భాల్లో టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. అయితే ఎన్టీఆర్ తనయుడు, చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ మాత్రం టీడీపీని ముందుకు నడిపించే విషయంలో నారా లోకేశ్ సమర్ధుడు అని ధీమా వ్యక్తం చేశారు.

తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ... అనేక అంశాలపై మనసు విప్పి మాట్లాడారు. ఇదే సమయంలో లోకేశ్ నాయకత్వ సమర్ధతపై వస్తున్న విమర్శలను బాలయ్య కొట్టిపారేశారు. లోకేశ్‌లో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని... అయినా ఈ అంశంపై తమ కుటుంబంలో ఎప్పుడూ చర్చ జరగలేదని బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. ఉన్నత విద్యను అభ్యసించిన లోకేశ్‌కు అనేక అంశాలపై అవగాహన ఉందన్న బాలకృష్ణ... పరోక్షంగా చంద్రబాబు తరువాత టీడీపీని నడిపించేది లోకేశ్ అని స్పష్టం చేశారు.
Published by: Kishore Akkaladevi
First published: June 9, 2020, 8:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading