టీడీపీకి భారీ షాక్.. వైసీపీలోకి బాలకృ‌ష్ణ ప్రాణ స్నేహితుడు..

నందమూరి బాలకృష్ణకు ఆయన సన్నిహితుడే భారీ షాక్ ఇవ్వబోతున్నారు. అత్యంత సన్నిహితుడు, ప్రాణ స్నేహితుడు కూడా అయిన కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు టీడీపీని వీడనున్నారు.

news18-telugu
Updated: March 10, 2020, 10:56 AM IST
టీడీపీకి భారీ షాక్.. వైసీపీలోకి బాలకృ‌ష్ణ ప్రాణ స్నేహితుడు..
నందమూరి బాలకృష్ణ
  • Share this:
నందమూరి బాలకృష్ణకు ఆయన సన్నిహితుడే భారీ షాక్ ఇవ్వబోతున్నారు. అత్యంత సన్నిహితుడు, ప్రాణ స్నేహితుడు కూడా అయిన కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు టీడీపీని వీడనున్నారు. సీఎం జగన్ సమక్షంలో అధికార పార్టీ వైసీపీలో చేరనున్నారు. ఈ రోజు మధ్యాహ్నమే ఆయన సీఎంను కలుస్తారని సమాచారం. కాగా.. బాబూరావు గత అసెంబ్లీ ఎన్నికల నుంచే టీడీపీ అధినేత చంద్రబాబుపై అలక వహిస్తూ వస్తున్నారు. నిజానికి.. కనిగిరి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన ఆయన్ను 2019 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి బరిలోకి దింపారు. కనిగిరి నుంచి ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి అవకాశం కల్పించారు. దీనిపై బాబూరావు తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. కనిగిరి సీటు మళ్లీ తనకే ఇవ్వాలని బాబూరావు టీడీపీకి అప్పట్లో స్పష్టం చేశారు. ఈ విషయంలో తాను వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేశారు కూడా. బాలయ్య ద్వారా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆయన్ను ఒప్పించడానికి బాలయ్య కుటుంబ సభ్యులు కూడా రంగంలోకి దిగినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
కదిరి బాబూరావు

అయితే.. దర్శి నుంచి పోటీ చేసిన బాబూరావు.. వైసీపీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాల్లో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే, సోషల్ మీడియాలో ఆయన పార్టీ మారతారంటూ వార్తలు ఊపందుకున్నాయి. వాటిని ఆయన ఖండించారు కూడా. ఇప్పుడు మాత్రం నిజంగానే పార్టీ మారనున్నట్లు సమాచారం.
Published by: Shravan Kumar Bommakanti
First published: March 10, 2020, 10:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading