సీఎం జగన్‌కు లేఖ రాసిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ

ప్రభుత్వం వెంటనే రైతు సమస్యలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: June 29, 2019, 4:32 PM IST
సీఎం జగన్‌కు లేఖ రాసిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ,ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి
  • Share this:
ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వం రైతుల్ని ఇబ్బంది పెడుతోందని ఆయన ఆరోపించారు. ఇది ఎంతమాత్రం సరికాదన్నారు బాలకృష్ణ. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలరోజులు అవుతున్నా, రైతులకు విత్తనాలు అందించకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే రైతు సమస్యలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం విత్తనాలు, ఎరువుల కోసం రైతులు రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చిందని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. సరైన ఏజెన్సీలకు విత్తన సరఫరా బాధ్యతలు ఇవ్వకపోవడం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందన్నారు నందమూరి బాలకృష్ణ. టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎరువులు, విత్తనాలు సమయానికి అందేవని గుర్తుచేశారు. ప్రస్తుతం పల్లెల్లో విద్యుత్ కోతతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని బాలకృష్ణ విమర్శించారు. టీడీపీ హయాంలో విద్యుత్ కోత అన్నది లేకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా చేశామని లేఖలో పేర్కొన్నారు.

First published: June 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...