బాలకృష్ణ పర్యటన రద్దు... అనుమతి లేదన్న పోలీసులు

బాలకృష్ణ వస్తున్నారన్న సమాచారంతో ఆయన్ని చూడడానికి అభిమానులు, గిరిజనులు ఉత్సాహం చూపించారు. అయితే పోలీసులు బాలయ్య పర్యటనకు అనుమతి నిరాకరించారు. అనుమతించేదిలేదని స్పష్టంచేశారు.

news18-telugu
Updated: May 14, 2019, 10:36 AM IST
బాలకృష్ణ పర్యటన రద్దు... అనుమతి లేదన్న పోలీసులు
నందమూరి బాలకృష్ణ
news18-telugu
Updated: May 14, 2019, 10:36 AM IST
టాలీవుడ్ హీరో , టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటన రద్దు అయ్యింది. ఆయన విశాఖ జిల్లాలో పర్యటించాలనుకున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. దీంతో బాలయ్య తమ జిల్లాకు వస్తున్నాడని ఆయన అభిమానులు సైతం ఆశగా ఎదురుచూశారు. ఇంతలో పోలీసులు వాళ్ల ఆశలపై నీళ్లు చల్లేశారు. బాలకృష్ణ పర్యటనకు పర్మిషన్ లేదని చెప్పేశారు. వివరాల్లోకి వెళ్తే... బాలకృష్ణ.. ధారాలమ్మ అమ్మవారిని దర్శించుకోవాలనుకున్నారు. సోమవారం ఇక్కడి ధారాలమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి బాలకృష్ణ వస్తున్నారన్న సమాచారంతో ఆయన్ని చూడడానికి అభిమానులు, గిరిజనులు ఉత్సాహం చూపించారు. అయితే పోలీసులు బాలయ్య పర్యటనకు అనుమతి నిరాకరించారు. అనుమతించేదిలేదని స్పష్టంచేశారు. దీంతో బాలకృష్ణ రావడం లేదని తెలియడంతో వారు నిరాశ చెందారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో భద్రతా కారణంగా పోలీసులు బాలకృష్ణ పర్యటనకు అనుమతి నిరాకరించారు.

ప్రస్తుతం ఏవోబీలో మావోయిస్టుల కదలికలు అధికంగా ఉన్నాయి. దీంతో గత కొన్నిరోజులుగా విశాఖ ఏజెన్సీలో హైఅలర్ట్ విధించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జోరుగా కూంబింగ్ కూడా కొనసాగుతోంది. దీంతో జీకేవీధి మండలంలో మావోయిస్టులు ఎన్నికల లెక్కింపు ముగిసేలోపు ఏదో ఒక సంఘటనకు పాల్పడతారన్న ముందస్తు సమాచారం పోలీసులకు అందింది. దీంతోనే భద్రత దృష్ట్యా బాలకృష్ణ రావడానికి పోలీసులు అనుమతించలేదని తెలిసింది. ఏటా బాలకృష్ణ ఏదో ఒక సమయంలో ధారాలమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఆదివారం తుని నుంచి ఒక బృందం ధారాలమ్మ ఆలయానికి వచ్చి బాలకృష్ణ రానున్న నేపథ్యంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేపట్టారు. అయితే సోమవారం బాలకృష్ణ పర్యటన రద్దు కావడంతో ఆ బృందం వెనుదిరిగింది.First published: May 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...