జూనియర్ ఎన్టీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ చిన్నల్లుడు

పార్టీలోకి వచ్చే ఉద్దేశం ఉంటే.. అధినేత చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు.

news18-telugu
Updated: August 26, 2019, 7:54 AM IST
జూనియర్ ఎన్టీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ చిన్నల్లుడు
ఎన్టీఆర్ అరవింద సమేత
  • Share this:
ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఉందని జోరుగా చర్చ జరుగుతున్న వేళ .. భరత్ ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదన్నారాయన. ఒకవేళ ఆయన అవసరం ఉంది అనుకుంటే ... పార్టీలోకి వచ్చే ఉద్దేశం ఉంటే.. అధినేత చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు. తనతో పాటు ఎవరికైనా పార్టీనే సుప్రీం అన్నారు శ్రీభరత్.  ఎన్టీఆర్ జనాలను ప్రభావితం చేసే వ్యక్తి, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మాట వాస్తవమే. కానీ రాజకీయాల్లోకి రావాలంటే.. అధినేత ఆలోచించి, పలానా వ్యక్తి రావాలని భావించాలి. అలాగే పార్టీలోకి రావాలని వచ్చే వ్యక్తి(ఎన్టీఆర్) కూడా అనుకోవాలన్నారు. అయినా జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి అవసరం లేదన్నారు.   ఎన్టీఆర్ వస్తేనే టీడీపీకి మంచిదంటే తాను ఒప్పుకోనున్నారు.

యువ నాయకులే కాస్త ప్రతిభ కనబరిచి కొత్త ఆలోచనలు చేయగలిగితేనే పార్టీని బిల్డ్ చేసుకోవచ్చన్నారు. సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయనతో పాటు వచ్చిన  294మంది.. జూ. ఎన్టీఆర్‌లా అందరికీ తెలిసినవారు కాదు కదా అన్నారు. ఫలానా వ్యక్తి వస్తేనే పార్టీకి బలం అనడం సరికాదన్నారు శ్రీభరత్. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్‌కు అప్పగించాలని సోషల్ మీడియాలో అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో శ్రీభరత్ ... జూనియర్‌పై చేసిన వ్యాఖ్యలు అటు టీడీపీతో పాటు... ఏపీ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి.

First published: August 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు