Home /News /politics /

NAMPALLY ACB COURT TO INVESTIGATE CHANDRABABU NAIDUS DISPROPORTIONATE ASSETS CASE FROM MAY 13TH BA

చంద్రబాబుకు మరో షాక్.. తెరపైకి ఆదాయానికి మించి ఆస్తుల కేసు, విచారణ తేదీ ఫిక్స్

చంద్రబాబు (ఫైల్)

చంద్రబాబు (ఫైల్)

లక్ష్మీపార్వతి దాఖలు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మే 13వ తేదీ నుంచి ఏసీబీ కోర్టు రెగ్యులర్ విచారణ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    2005 నాటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చంద్రబాబుకు చిక్కులు తప్పేలా లేవు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న కేసుల్లో స్టేలు ఒక్కొక్కటిగా ఎత్తేస్తున్న నేపథ్యంలో హైకోర్టు... ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి దాఖలు చేసిన ఓ కేసులో స్టే కూడా ఎత్తేసింది. దీంతో హైదరాబాద్ ఏసీబీ కోర్టు ఈ కేసులో విచారణ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.  దేశవ్యాప్తంగా సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న కేసుల్లో స్టేలను ఎత్తివేయాలంటూ ఈ మధ్య సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని పలు హైకోర్టులు అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా 2005లో చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి హైదరాబాద్ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన కేసుపై హైదరాబాద్ హైకోర్టులో ఉన్న స్టేను కూడా ఎత్తేసినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగా విచారణకు సిద్ధమవుతున్న ఏసీబీ కోర్టు... ఈ కేసు విచారణ కొనసాగింపుకు తన అభిప్రాయం చెప్పాలని పిటిషనర్ అయిన లక్ష్మీపార్వతిని కోరింది. దీంతో ఆమె కోర్టుకు హాజరై విచారణ కొనసాగింపునకు అనుకూలంగానే తన అభిప్రాయం వెల్లడించారు. త్వరలో ఈ కేసు విచారణ ప్రారంభించేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    Ap elections 2019, chandrababu naidu, tdp, evm hacking, chandrababu statements on elections, ysrcp, ys jagan mohan reddy, ఏపీ ఎన్నికలు 2019, చంద్రబాబునాయుడు, టీడీపీ, ఈవీఎం హ్యాకింగ్, ఎన్నికలపై చంద్రబాబు ప్రకటనలు, వైసీపీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
    చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)


    వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అప్పట్లో దాఖలైన అక్రమాస్తుల కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ ప్రారంభం కావడం, దర్యాప్తు నేపథ్యంలో 16 నెలల పాటు జగన్ చంచల్ గూడ జైల్లో ఉండటం, ఈ కేసులో దాఖలైన 11 ఛార్జిషీట్ల విచారణలో భాగంగా ఇప్పటికీ ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరవడాన్ని టీడీపీ ఎప్పటినుంచో టార్గెట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అక్రమాస్తుల కేసులోనూ దర్యాప్తు కోరుతూ వైసీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు... సీబీఐకి అప్పగించింది. అయితే తగిన సిబ్బంది లేని కారణంగా ఈ కేసు దర్యాప్తు చేయలేమంటూ సీబీఐ చేతులెత్తేయడంతో ఈ కేసు కూడా పెండింగ్ లో ఉంది.

    posani krishna murali fires on tdp president chandrababu naidu over sexual harrasment allegations on lakshmi paravathi,తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఒక రోజు గడువు మాత్రమే ఉంది. అందులో ఏపీలో ఈ పొలిటికల్ హీట్ కాస్తా ఎక్కువగానే ఉంది. ఎన్నికల వేళ పై చేయి సాధించడానికి ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. లక్ష్మీ పార్వతి లైంగిక ఆరోపణలపై పోసాని తనదైన శైలిలో స్పందించారు.posani krishna murali,posani comedy,posani krishna murali age,posani krishna murali controversial commnets,posani krishna murali chandrababu naidu lakshmi paravthi,posani comments on lakshmi parvathi sexual harrasment,sexual allegations on lakshmi paravathi,Andhra pradesh news,andhra pradesh politics,పోసాని కృష్ణమురళి,పోసాని కృష్ణ మురళి కామెంట్స్ చంద్రబాబు నాయుడు,పోసాని కృష్ణ మురళి లక్ష్మీ పార్వతి చంద్రబాబు నాయుడు,లక్ష్మీ పార్వతి పై లైంగిక ఆరోపణలు,చంద్రబాబు నాయుడు పై పోసాని ఫైర్,ఏపీ న్యూస్,ఏపీ పాలిటిక్స్,
    లక్ష్మీ పార్వతి, చంద్రబాబు


    లక్ష్మీపార్వతి దాఖలు చేసిన కేసులో చంద్రబాబు హైకోర్టులో స్టే తెచ్చుకున్న నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ స్టే ఎత్తేస్తూ తాజాగా హైకోర్టు నిర్ణయం తీసుకుందన్న వార్తలు టీడీపీలో సైతం కలకలం రేపుతున్నాయి. సుదీర్ఘంగా పెండింగ్ లో కేసులన్నింటిలోనూ స్టేలు ఎత్తేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు చంద్రబాబు శిబిరంలో కలకలం పుట్టించడం వెనుక మరిన్ని కారణాలు ఉన్నాయి. తనకు వ్యతిరేకంగా దాఖలైన 27 కేసుల్లో చంద్రబాబు స్టేలు తెచ్చుకున్నారు. దీనిపై అప్పట్లో కాంగ్రెస్ పార్టీ, అనంతరం వైసీపీ తీవ్ర విమర్శలకు దిగుతూనే ఉన్నాయి.

    Lakshmi Parvathi taken Huge amount for giving Lakshmi's NTR permission to Ram Gopal Varma pk.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఇప్పుడు సెన్సేష‌న‌ల్ అవుతుంది. ఈ సినిమా విడుద‌ల‌కు ముందే నానా ర‌చ్చ చేస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇంకా సెన్సార్ పూర్తి కాక‌పోవ‌డంతో మార్చ్ 29న కూడా ఈ సినిమా వ‌స్తుందా రాదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. lakshmi's ntr,lakshmi's ntr twitter,lakshmi's ntr release date,lakshmi's ntr censor date,lakshmi's ntr lakshmi parvathi,lakshmi parvathi 1.5 crore fee,lakshmi's ntr rgv,lakshmi's ntr censor completed,telugu cinema,లక్ష్మీస్ ఎన్టీఆర్,లక్ష్మీస్ ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి,లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసం లక్ష్మీ పార్వతికి కోటిన్నర,లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల,లక్ష్మీస్ ఎన్టీఆర్ సెన్సార్ పూర్తి,లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల తేదీ,లక్ష్మీస్ ఎన్టీఆర్ రామ్ గోపాల్ వర్మ
    లక్ష్మీ పార్వతి ( ఫేస్ బుక్ ఫోటో)


    తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు స్టేలను ఒక్కొక్కటిగా ఎత్తేయడం ప్రారంభిస్తే మిగతా కేసుల్లోనూ చంద్రబాబుకు చిక్కులు తప్పకపోవచ్చని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముందుగా లక్ష్మీపార్వతి దాఖలు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మే 13వ తేదీ నుంచి ఏసీబీ కోర్టు రెగ్యులర్ విచారణ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    (సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
    First published:

    Tags: Chandrababu naidu, Lakshmi Parvathi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు