‘నమో’కి షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం

పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా నమో టీవీ ద్వారా ప్రచారం జరుగుతోందంటూ కాంగ్రెస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: April 17, 2019, 5:03 PM IST
‘నమో’కి షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 17, 2019, 5:03 PM IST
బీజేపీ ప్రచార ఛానల్ నమో టీవీ మీద కేంద్ర ఎన్నికల సంఘం మరిన్ని ఆంక్షలు విధించింది. ఎన్నికల నిర్వహణ చట్టం ప్రకారం పోలింగ్ తేదీకి 48 గంటల ముందు నుంచీ ఎలాంటి ఎన్నికల సమాచారం ప్రసారం చేయడానికి వీల్లేదని, లైవ్ ప్రోగ్రామ్స్ కాకుండా రికార్డ్ చేసిన ప్రోగ్రామ్స్ కూడా ప్లే చేయకూడదని స్పష్టం చేసింది. మిగిలిన ఆరు దశల ఎన్నికల్లో ఈ నిబంధనలు అమలయ్యేలా చూడాలంటూ ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారికి ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలు అమలయ్యేలా చూడడానికి ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా నియమించినట్టు తెలిసింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 126 ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి టీవీల్లో కానీ, వీడియోల్లో కానీ, మరేదైనా ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా కానీ ‘ఎన్నికల ప్రచారం’ జరపకూడదు. ఈ 48 గంటల సమయాన్ని ‘సైలెన్స్ పీరియడ్’ అంటారు. అప్పటి వరకు రాజకీయ పార్టీల ప్రచారం హోరెత్తిపోయి ఉంటుంది కాబట్టి, ఆ 48 గంటల సమయంలో ఓటర్లు తాము ఎవరికి ఓటు వేయాలనే అంశాన్ని స్థిమితంగా ఆలోచించుకోవడానికి ఈ కండిషన్ పెట్టారు. ఈ నిబంధన ‘నమో టీవీ’కి కూడా వర్తిస్తుందని ఎన్నికల అధికారులు తెలిపారు.

పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా నమో టీవీ ద్వారా ప్రచారం జరుగుతోందంటూ కాంగ్రెస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఢిల్లీ సీఈవోను వివరణ కోరింది ఈసీ. మరోవైపు నమో టీవీ అనేది అడ్వర్‌టైజింగ్ ప్లాట్ ఫాం కాబట్టి దానికి ప్రసార మంత్రిత్వ శాఖ అనుమతి అవసరం లేదని కేంద్ర మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

First published: April 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...