ఆహార పొట్లాలను వదలని ప్రచారం...నమో ఫుడ్ ప్యాకెట్స్ కలకలం...

ఎన్నికల ప్రచారం కోసం ఆహార పొట్లాలను కూడా వదలడం లేదు రాజకీయ పక్షాలు...నమో ఫుడ్స్ పేరిట ఎన్నికల సిబ్బందికి సరఫరా అయిన ఫుడ్ ప్యాకెట్స్ ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి.

news18-telugu
Updated: April 11, 2019, 3:40 PM IST

లోక్‌సభ ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘించేందుకు రాజకీయ పార్టీలు ఏ ఒక్కదారి వదలడం లేదు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లోని నోయిడాలో గౌతమ్ బుద్ధనగర్ పరిధిలో ఎన్నికల సిబ్బందికి నమో ఫుడ్స్ పేరిట కాషాయ రంగు ఫుడ్ ప్యాకెట్స్ సరఫరా చేయడం కలకలం రేపుతోంది. అయితే నమో పేరిట సరఫరా అయిన ఫుడ్ ప్యాకెట్స్‌కు భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని గౌతమ్ బుద్ధనగర్ ఎన్నికల అధికారులు ఆరోపణలు తోసిపుచ్చుతున్నారు. సిబ్బందికి సరఫరా అవుతున్న ఆహార ప్యాకెట్లపై నమో అని ఉండటం పెద్ద సమస్య కాదని, అదే పేరుతో దుకాణాలు ఉండవచ్చని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు.ఇదిలా ఉంటే స్థానికంగా ఉన్న నమో ఫుడ్స్‌ను సంప్రదిస్తే మాత్రం తాము ఎన్నికల సిబ్బందికి ఎలాంటి ఆహార ప్యాకెట్స్ సరఫరా చేయలేదని తెలిపడం విశేషం. ఇదిలా ఉంటే యూపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మాత్రం నమో ఫుడ్ ప్యాకెట్స్ ఘటనపై రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఎన్నికల నియామవళి ఉల్లంఘనకు పాల్పడితే చర్యలు తీసుకోవాలని తెలిపారు.

First published: April 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...