ఓటు గల్లంతు.. పోలింగ్ బూత్ బయట వ్యక్తి హఠాన్మరణం

కొల్లంలోని కిలికొల్లూర్‌లో ఉన్న ఎల్పీ స్కూల్ బూత్‌లో ఓటు వేయడానికి మణి వచ్చారు. అయితే, అతని ఓటు గల్లంతైంది. దీంతో పోలింగ్ బూత్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత మణి కుప్పకూలిపోయారు.

news18-telugu
Updated: April 23, 2019, 3:44 PM IST
ఓటు గల్లంతు.. పోలింగ్ బూత్ బయట వ్యక్తి హఠాన్మరణం
పోలింగ్ సందర్భంగా బారులు తీరిన ఓటర్లు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కేరళలో పోలింగ్ సందర్భంగా ఓటు వేయడానికి వచ్చి ఏడుగురు చనిపోయారు. రాష్ట్రంలోని వేర్వేరు చోట్ల ఈ ఘటనలు జరిగాయి. అందులో ఓ వ్యక్తి తన ఓటు గల్లంతైందని తెలుసుకుని హఠాన్మరణం చెందాడు. కొల్లంలోని కిలికొల్లూర్‌లో ఉన్న ఎల్పీ స్కూల్ బూత్‌లో ఓటు వేయడానికి మణి వచ్చారు. అయితే, అతని ఓటు గల్లంతైంది. దీంతో పోలింగ్ బూత్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత మణి కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తీసుకెళ్లేసరికి చనిపోయారు. కన్నూర్ జిల్లాలోని చోక్కీలో ఉన్న రామవిలాసం హెచ్‌ఎస్ఎస్ పోలింగ్ బూత్‌లో ఓటు వేయడానికి క్యూలో నిలబడిన విజయ (65) అనే వృద్ధురాలు చనిపోయింది. ఎర్నాకుళం జిల్లా పట్టణంతిట్టలో ఉన్న పెళంపరా డీపీఎం యూపీఎస్ పాఠశాలలో ఓటు వేసేందుకు వచ్చిన ఛాకో మాతాయ్ (66) స్పృహతప్పి పడిపోయారు. ఆస్పత్రికి తీసుకుని వెళ్లేసరికే ప్రాణాలు కోల్పోయారు. వయనాడ్‌లో బాలన్, తాలిపరంబలో వేణుగోపాల మరార్, మావేలిక్కరకు చెందిన ప్రభాకరన్ కూడా పోలింగ్‌లో పాల్గొనడానికి వచ్చి ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఛాకో మాతాయ్ పోలింగ్ బూత్‌లో స్పృహతప్పి పడిపోయారు. అలప్పుళలో ప్రాణుకుమార్ అనే పోలింగ్ ఆఫీసర్‌కు ఫిట్స్ రావడంతో ఆస్పత్రికి తరలించారు.

First published: April 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>