Nalgonda Loksabha : కమ్యూనిస్టుల కంచుకోటలో గులాబీ బోణీ చేస్తుందా ?

నల్గొండ (ఫైల్ చిత్రం)

Loksabha constituency profile : 2004 వరకు ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చిన కమ్యూనిస్టు పార్టీలకు.. ఇప్పుడు నల్గొండలో ఉనికి చాటుకోవడమే గగనమైపోయింది. మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల జోష్, పార్లమెంటు ఎన్నికల్లోనూ కొనసాగించి నల్లగొండ కోటపై గులాబీ జెండా ఎగురవేయాలని ప్రయత్నం చేస్తోంది.

  • Share this:
    తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాల్లో ఒకటైన నల్గొండ.. సాయుధ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డగా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. మొదటి నుంచీ కమ్యూనిస్టు పార్టీకి కంచుకోటగా ఉండి.. విప్లవోద్యమాలకు కేంద్రమైంది. అయితే, ప్రస్తుతం కమ్యూనిస్టులు అక్కడ ప్రత్యర్థుల దరిదాపుల్లో లేనంతగా పట్టు కోల్పోయారు. 2004 వరకు ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చిన కమ్యూనిస్టు పార్టీలకు.. ఇప్పుడు ఉనికి చాటుకోవడమే గగనమైపోయింది.

    నాగార్జున సాగర్ డ్యాం (ఫైల్ ఫోటో)
    నాగార్జున సాగర్ డ్యాం (ఫైల్ ఫోటో)


    1957లో జరిగిన తొలి ఎన్నికలో ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ విజయాన్ని నమోదు చేసింది. మూడో దఫా ఎన్నికలో కాంగ్రెస్ ఖాతా తెరిచింది. అనంతరం జరిగిన ఎన్నికల్లోనూ సత్తా చాటిన కాంగ్రెస్.. తొంభైల్లో మళ్లీ కమ్యూనిస్టుల చేతిలో చిత్తయిపోయింది. అయితే, 2004లో నల్గొండ స్థానాన్ని గెలిచిన కమ్యూనిస్టు పార్టీ.. ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 2009, 2014 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డి విజయం సాధించారు. 2009లో సమీప సీపీఐ అభ్యర్థి సురవరం సుధాకర్ రెడ్డిపై 1,52,983 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన ఆయన, 2014లో సమీప టీడీపీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డిపై 1,93,156 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

     

    Telangana, congress mla surendar, yellareddy mla, Nizamabad, cm kcr, ktr, telangana politics, తెలంగాణ, కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే, నిజామాబాద్, సీఎం కేసీఆర్, తెలంగాణ రాజకీయాలు
    కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎన్నికల గుర్తులు


    ఈ పార్లమెంటు స్థానం పరిధిలో మొత్తంగా ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. మిర్యాలగూడ, సూర్యపేట, నాగార్జునసాగర్, నల్గొండ, హుజూర్‌నగర్, దేవరకొండ, కోదాడ నియోజకవర్గాలు.. ఈ ఎంపీ స్థానం పరిధిలోకి వస్తాయి. ఒక్క హుజూర్ నగర్ తప్ప ఈ అసెంబ్లీ సెగ్మెంట్లన్నింటిలో దాదాపుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహిస్తుండడం విశేషం.

    నల్గొండ పార్లమెంటు స్థానం పరిధిలో మొత్తం 1495580 మంది ఓటర్లు ఉండగా.. అందులో మహిళా ఓటర్లు 748299 మంది కాగా.. పురుషులు 747281 మంది ఉన్నారు. ప్రస్తుతం ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ.. ఆయన అధికార టీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

    నల్గొండ పార్లమెంటు స్థానంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు




































































    1957 దేవులపల్లి వేంకటేశ్వరరావు సీపీఐ
    1962 రావి నారాయణ రెడ్డి సీపీఐ
    1967 మహమ్మద్ యూనస్ సలీం కాంగ్రెస్
    1971 కె.రామకృష్ణారెడ్డి తెలంగాణా ప్రజా సమితి
    1977 అబ్దుల్ లతీఫ్ కాంగ్రెస్
    1980 టి.దామోదర్ రెడ్డి కాంగ్రెస్
    1984 ఎం.రఘుమారెడ్డి టీడీపీ
    1989 చకిలం శ్రీనివాసరావు కాంగ్రెస్
    1991 ధర్మబిక్షం సీపీఐ
    1996 ధర్మబిక్షం సీపీఐ
    1998 సురవరం సుధాకర్ రెడ్డి సీపీఐ
    2009 గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్
    2014 గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్


    First published: