తనపై జరిగిన దాడిపై థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని కోరుతూ వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. జగన్ తరుపున ప్రముఖ న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఏపీ పోలీసుల విచారణ తీరుపై కోర్టుకు తమ అనుమానాలను వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరిగితే కింద స్థాయి ఉద్యోగుల చేత విచారణ జరిపించడం హాస్యాస్పదం అని ఆయన కోర్టుకు తెలిపారు.
భుజంపై కాకుండా ఆ కత్తి మెడపై తగిలి ఉంటే జగన్ ప్రాణాలకే ప్రమాదం ఉండేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే 161 సీఆర్పీసీ పోలీసుల విచారణకు జగన్ ఎందుకు సహకరించలేదని ఆయన తరుపు న్యాయవాదిని కోర్టును ప్రశ్నించింది. అయితే ఏపీ పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, అందుకే విచారణకు అంగీకరించలేదని ఆయన బదులిచ్చారు.కాబట్టి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థతో దీనిపై విచారణ జరిపించాలని ఆయన కోర్టుకు విన్నవించారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన విచారణ నివేదికను సీల్డ్కవర్లో అందజేయాలని ఏపీ పోలీసులను కోర్టు ఆదేశించింది. జగన్పై దాడికి సంబంధించి ఇప్పటివరకు సిట్ చేసిన విచారణను మంగళవారం నాటికల్లా సీల్డ్ కవర్లో సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
Published by:Srinivas Mittapalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.